మాళవిక.. మళ్లీ వస్తోంది

‘నేల టికెట్టు’తో తెలుగు తెరపై ఎంట్రీ ఇచ్చింది మాళవికా శర్మ. ప్రస్తుతం ఈ బ్యూటీ ‘భీమా’తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.

This browser does not support the video element.

‘భీమా’ మార్చి 8న విడుదల కానుంది. హర్ష తెరకెక్కించిన ఈ సినిమాలో మాళవిక సంప్రదాయ లుక్‌కి కుర్రకారు ఫిదా అవుతోంది.

 మాళవిక ముంబయిలో జన్మించింది. స్థానిక రిజ్వి కాలేజీలో లా పూర్తి చేసింది.

మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించిన ఆమె ప్రముఖ బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరించింది. ఆ యాడ్‌ల ద్వారానే సినిమాల్లో అవకాశం వచ్చిందట.

‘చిన్నప్పుడే ఇష్టంతో కథక్‌ నేర్చుకున్నా. అదిప్పుడు ఉపయోగపడుతోంది. బాధ, సంతోషం, కోపం ఏ ఎమోషన్‌లో ఉన్నా డ్యాన్స్‌ చేస్తాను’ అని అంటోంది.

విహారయాత్రలు అంటే భలే సరదా. టూర్ల ఫొటోలను ఇన్‌స్టాలో షేర్‌ చేయడమూ ఇష్టమే. తన ఇన్‌స్టా ఫాలోవర్లు 2కోట్లకు పైమాటే!

సామాజిక బాధ్యత కూడా ఎక్కువే. అనాధ పిల్లల కోసం సాయం చేస్తూ ఉంటుంది. మొన్నామధ్య ఓ స్కూల్లో చిన్నారుల పాదాలకు చెప్పులు తొడిగిన వీడియో చూసే ఉంటారు. 

This browser does not support the video element.

‘భీమా’తోపాటు సుధీర్‌బాబు ‘హరోం హర’లోనూ నటిస్తోంది. ప్రభాస్‌- మారుతి ‘రాజాసాబ్‌’లో కీలక పాత్రలో కనిపించనుందట.

‘నేల టికెట్టు’ తర్వాత ‘రెడ్‌’, ‘కాఫీ విత్‌ కాదల్‌’ చేసినా... సరైన విజయం దక్కించుకోలేకపోయిన మాళవిక ఇప్పుడేం చేస్తుందో చూడాలి.

మాళవికకు వంట చేయడం అంటే ఇష్టం. కానీ వంట గదికి వెళ్లాలంటేనే భయం. ఇటీవల కూరగాయలు తరుగుతుంటే వేలు తెగి, రక్తం వచ్చిన వీడియో షేర్‌ చేసింది. వెంటనే వైరల్‌ అయ్యింది కూడా.

అల్లు అర్జున్‌ ఫిట్‌నెస్‌ సీక్రెట్స్‌

ఆ సినిమాలు బోర్‌ కొట్టవు!

మలయాళీ బ్యూటీస్‌.. తెరపై క్యూట్‌నెస్‌

Eenadu.net Home