రాకుమారిగా ఇస్మార్ట్‌ బ్యూటీ..

‘మాస్ట్రో’ తర్వాత నభా నటేష్‌ మళ్లీ తెరపై కనిపించలేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ ‘స్వయంభూ’లో రాకుమారి సోఫీగా కనిపించనుంది.

ఇటీవల చిత్రబృందం నభాకు వెల్‌కమ్‌ చెప్తూ ఓ పోస్టర్‌ని విడుదల చేశారు. దీంతో ఈ బ్యూటీ అభిమానులు ‘ఎన్నాళ్లైంది నిన్ను తెర మీద చూసి అని...’ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ప్రియదర్శితో కలసి ‘డార్లింగ్‌’ అనే సినిమా చేసింది. ఏప్రిల్‌ 20న ఈ సినిమాను టీజర్‌తో అనౌన్స్‌ చేశారు.

2021లో రోడ్‌ యాక్సిడెంట్‌లో నభాకు గాయాలయ్యాయి. పూర్తిగా కోలుకొని వెండితెరపై ‘స్వయంభూ’తో రీఎంట్రీ ఇస్తోంది. 

నభా కర్ణాటకలోని శృంగేరిలో పుట్టింది. డిగ్రీ పూర్తి చేసిన ఈ భామ.. 16 ఏళ్ల వయసులోనే మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించింది. 

ఫెమినా మిస్‌ ఇండియా 2013 పోటీల్లో పాల్గొని టాప్‌ టెన్‌లో నిలిచింది. 2015లో కన్నడలో ‘వజ్రకాయ’తో చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది.

‘ఇస్మార్ట్‌ శంకర్‌’లో ఈ బ్యూటీ గ్లామర్‌కు కుర్ర కారు ఫిదా అయింది. ఈ చిత్రంతోనే మంచి గుర్తింపు వచ్చింది.

ఆ తర్వాత వరుసగా ‘డిస్కో రాజా’, ‘సోలో బ్రతుకే సో బెటర్‌’, ‘అల్లుడు అదుర్స్‌’, ‘మాస్ట్రో’ తదితర చిత్రాలతో అలరించింది.

ఈ కన్నడ బ్యూటీ హృతిక్‌ రోషన్‌, అల్లు అర్జున్‌లకు వీరాభిమాని. పవన్‌కల్యాణ్‌, రవితేజ చిత్రాలను కూడా ఎక్కువగా చూస్తుందట.

‘దాదాపు మూడేళ్ల పాటు బ్రేక్‌ ఇచ్చాక ‘స్వయంభూ’తో రీ ఎంట్రీ ఇస్తున్నా. యుద్ధ నేపథ్యంలో, పాన్ఇండియా రేంజ్‌లో రూపొందుతున్న ఈ చిత్రంలో నటించే అవకాశం లభించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్రంలో నా పాత్ర ప్రత్యేకంగా ఉంటుంది’ అని చెబుతోందీ బ్యూటీ.  

This browser does not support the video element.

సినిమాలకు దూరంగా ఉన్నా సోషల్‌ మీడియాలో మాత్రం ఫుల్‌ యాక్టివ్‌. తన ఇన్‌స్టాలో వయ్యారాలు ఒలికిస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను పోస్టు చేస్తుంది. 

నాజూగ్గా ఉండే ఈ భామ ఆహారం విషయంలో ప్రత్యేకంగా నియమాలేమీ పెట్టుకోదు. దానికి తగ్గట్టుగానే జిమ్‌లో కష్టపడుతుందట. అన్నట్టు తన ఇన్‌స్టా ఖాతా ఫాలోవర్ల సంఖ్య 50లక్షలకు పైమాటే..!

నిఖిల్‌ సిద్ధార్థ్‌ హీరోగా వస్తోన్న ఈ చిత్రానికి భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో మరో నాయిక సంయుక్త. పాన్‌ ఇండియా చిత్రమిది. 

ఈవారం ఓటీటీ సినిమాలు/సిరీస్‌లు

రకుల్‌ప్రీత్‌ ఫిజీ డైరీస్‌

ఆయనే నా డ్యాన్స్‌ టీచర్‌

Eenadu.net Home