క్యూటే కాదు... వైరల్‌ కూడా..!

#eenadu

సిద్ధార్థ్‌, అదితీ రావు హైదరీ ఇటీవల నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే..! వీరిద్దరూ సోషల్‌ మీడియాలో ఏ ఫొటో పెట్టినా.. అది క్షణాల్లో వైరల్‌ అయిపోతుంది. 

కిరణ్‌ అబ్బవరం తన మొదటి సినిమా హీరోయిన్‌ రహస్య గోరక్‌తో ఇటీవల ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నారు. వీరు కూడా మోస్ట్‌ వైరల్‌ కపుల్‌ లిస్ట్‌లో చేరిపోయారు..

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కొంత కాలంగా రిలేషన్‌లో ఉన్న ప్రియుడు జాకీ భగ్నానీని ఇటీవల వివాహమాడింది. ఆ ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.  

గతేడాది చివరిలో వరుణ్‌తేజ్‌, లావణ్య త్రిపాఠి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. వీరిద్దరూ ట్రిప్‌లు, పార్టీలు, పండుగల సమయాల్లో దిగిన ఫొటోలు నెట్టింట ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటాయి. 

రామ్‌ చరణ్‌, ఉపాసన బీచ్‌లు, పార్టీలు, ఫంక్షన్లలో సందడి చేస్తూ ఉంటారు. పండుగ సమయాల్లో ప్రత్యక ఆకర్షణగా నిలుస్తుందీ జంట. 

శర్వానంద్‌, లాయర్‌ రక్షిత రెడ్డికి గతేడాది వివాహం జరిగింది. వీరికి ఒక బాబు కూడా..! సోషల్‌ మీడియాలో ఈ జంట ఎప్పుడూ హాట్‌ టాపిక్‌గానే నిలుస్తోంది. 

ప్రేమించి పెళ్లాడిన విరాట్‌ అనుష్కలకు అభిమానులు ముద్దుగా.. విరుష్క అని పేరు పెట్టారు. ఒకరి పట్ల ఒకరు చూపించే కేరింగ్‌, బాధ్యతకు నెటిజన్లు వీరిపై ప్రశంసలు కురిపిస్తూనే ఉంటారు.  

నయనతార విఘ్నేష్‌లు.. పార్టీలు, పూజలు, ఆలయాలకో వెళ్లినప్పుడు తీసుకున్న ఫొటోలను నెట్టింట షేర్ చేస్తారు. క్యూట్‌ జోడీ అంటూ కామెంట్లతో పాటు అవి ఇలా వైరల్‌ అవుతూ ఉంటాయి. 

కియారా అడ్వాణీ, సిద్ధార్థ్‌ మల్హోత్రది ప్రేమ పెళ్లి. సోషల్‌ మీడియాలో వీరిద్దరూ మోస్ట్‌ క్యూట్‌ జోడీగా నిలుస్తున్నారు.

రణ్‌బీర్‌ కపూర్‌, అలియా భట్‌.. పార్టీలు, పంక్షన్లలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు. ప్రతి పండుగనూ ఘనంగా నిర్వహిస్తారు. ఆ ఫొటోలను ఇలా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. 

కాజల్‌, గౌతమ్‌ కిచ్లుది కూడా ప్రేమ వివాహమే... వీరు విహార యాత్రలకు ఎక్కువగా వెళుతుంటారు. కాజల్‌ ఇన్‌స్టాలో పోస్టు చేసే ఫొటోలకు ఆమె అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తారు.

రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె నెట్టింట ఎప్పుడూ సందడి చేస్తూనే ఉంటారు. సరదాగా రీల్స్‌ చేస్తూ వాటిని అభిమానులతో పంచుకుంటారు. 

నలుపు.. అందాల మెరుపులు

ఫస్ట్‌ డే కలెక్షన్స్‌.. టాప్‌-10 చిత్రాలివే!

2024 మోస్ట్‌ పాపులర్‌ స్టార్స్‌

Eenadu.net Home