ఆరోగ్య బీమా.. నిబంధనల్లో మార్పులివీ!

ఆరోగ్య బీమా పాలసీ నిబంధనల్లో ఇటీవల కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. క్యాష్‌లెస్‌ దగ్గర నుంచి.. క్లెయిమ్‌ సెటిల్‌మెంట్‌ వరకు వచ్చిన ఆ మార్పులేంటో చూసేయండి..

అంతా క్యాష్‌లెస్‌ 

ఏదైనా కారణంతో బీమా సంస్థతో టై-అప్‌ కాని ఆసుపత్రిలో చేరితే ముందుగా పాలసీదారులే డబ్బులు చెల్లించి డిశ్చార్జి తర్వాత ఆ డబ్బును క్లెయిమ్‌ చేసుకోవాల్సి ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఏ హాస్పిటల్‌లో చేరినా క్యాష్‌లెస్‌ చికిత్స పొందొచ్చు.

వెయిటింగ్‌ పీరియడ్‌

పాలసీ తీసుకుంటున్న సమయానికి పాలసీదారుడు ఏదైనా అనారోగ్యంతో బాధపడుతుంటే.. పాలసీ కవరేజీ ప్రారంభం కావడానికి నాలుగేళ్ల వెయిటింగ్‌ పీరియడ్‌ ఉండేది. దాన్ని మూడేళ్లకు తగ్గించారు.

ఆయుష్‌ చికిత్సలకు

ఇతర చికిత్స పద్ధతుల్లానే ఆయుష్‌ చికిత్సలకూ (ఆయుర్వేదం, హోమియోపతి, యోగ, సిద్ధ) బీమా హామీ లభిస్తుంది. ఆయుష్‌ చికిత్స కవరేజీకి ఎలాంటి పరిమితీ లేదని ఐఆర్‌డీఏఐ స్పష్టంచేసింది.

3 గంటల్లో సెటిల్‌మెంట్‌

శస్త్రచికిత్స చేసుకున్న తర్వాత కొన్నిసార్లు క్లెయిమ్‌ సెటిల్‌మెంట్‌ పూర్తి అవ్వడానికి చాలా సమయం అయ్యేది. ఇకపై డిశ్చార్జి అభ్యర్థన వచ్చిన మూడు గంటల్లోనే బీమా సంస్థలు ఫైనల్‌ ఆథరైజేషన్‌ ఇవ్వాల్సి ఉంటుంది.

మారటోరియం పీరియడ్‌

యాక్టివ్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ మారటోరియం వ్యవధిని 8 సంవత్సరాల నుంచి 5 ఏళ్లకు తగ్గించారు. ఐదేళ్ల పాటు క్రమం తప్పకుండా ప్రీమియం చెల్లించినట్లయితే బీమా సంస్థ ఏదైనా కారణం చూపి క్లెయిమ్‌లనూ తిరస్కరించడానికి వీల్లేదు.

ఒకేసారి వేర్వేరు పాలసీలు

ఒక చికిత్సకు ఒకట్రెండు పాలసీలను ఒకేసారి క్లెయిమ్‌ చేసుకోవచ్చు. మీ వద్ద రూ.5 లక్షల బీమాకు సంబంధించిన రెండు పాలసీలు ఉంటే మీ హాస్పిటల్‌ ఖర్చును రెండింటి ద్వారా చెల్లించొచ్చన్నమాట.

సైకిల్‌ తొక్కితే ప్రయోజనాలు ఏంటి?

డ్రైఫ్రూట్స్‌ను పచ్చిగా తీసుకోవాలా, నానబెట్టి తినాలా?

రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు ఈ పానీయాలు ట్రై చేయండి

Eenadu.net Home