షావోమీ @10.. లాంచ్‌ చేసిన కొత్త ఉత్పత్తులివే..!

షావోమీ ఇండియాలో సంస్థను ప్రారంభించి పదేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా దేశీయ విపణిలోకి కొన్ని ఉత్పత్తులను లాంచ్‌ చేసింది.

రెడ్‌ మీ 13 5జీ

రెడ్‌మీ 12 5జీకి కొనసాగింపుగా 13ని రెడ్‌మీ తీసుకొచ్చింది. దీని ధరను రూ.12,999గా నిర్ణయించింది.

This browser does not support the video element.

కీ ఫీచర్లు: 6.79 అంగుళాల FHD+ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్‌ 4 జెన్‌ 2 ఏఈ ప్రాసెసర్‌, 5030mAh బ్యాటరీ, 33W ఫాస్ట్‌ ఛార్జింగ్

రెడ్‌మీ బడ్స్‌ 5సీ

ఈ ఇయర్‌ బడ్స్‌ ధరను ₹1,999గా షావోమీ ప్రకటించింది. 40db యాక్టివ్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్‌తో వస్తోంది.

This browser does not support the video element.

టచ్‌ కంట్రోల్‌తో వస్తున్న ఈ ఇయర్‌ బడ్స్‌ను సింగిల్‌ ఛార్జ్‌పై 7 గంటల పాటు వినియోగించొచ్చు. AI ENC కూడా ఉంది.

పవర్‌ బ్యాంక్స్‌

10,000mah కెపాసిటీతో టైప్‌-సి కేబుల్‌ కలిగిన రెండు పవర్‌ బ్యాంక్‌లను షావోమీ మార్కెట్లోకి తీసుకొచ్చింది. 2 వే ఛార్జింగ్‌ సదుపాయంతో వస్తున్నాయి.

పాకెట్‌ పవర్‌ బ్యాంక్‌ ధర రూ.1,699 కాగా.. పవర్‌ బ్యాంక్‌ 4i ధర రూ.1299గా కంపెనీ నిర్ణయించింది.

షావోమీ రోబో వాక్యూమ్‌ క్లీనర్‌ X10

అత్యాధునిక ఫీచర్లతో దేశీయ మార్కెట్లోకి షావోమీ మరో వాక్యూమ్‌ క్లీనర్‌ను లాంచ్‌ చేసింది. దీని ధరను రూ.29,999గా నిర్ణయించింది.

షావోమీ యాప్‌ ద్వారా దీన్ని కంట్రోల్‌ చేయొచ్చు. 5,200mAh బ్యాటరీ కలిగిన ఈ వాక్యూమ్‌ క్లీనర్‌ను ఒకసారి ఛార్జ్‌ చేసి 240 నిమిషాల పాటు క్లీన్‌ చేయొచ్చని కంపెనీ తెలిపింది.

‘మీ టికెట్‌’లో అన్ని టికెట్లూ తీసుకోవచ్చు!

త్వరలో ఐఫోన్‌ SE4, పిక్సెల్‌ 9A.. ఇంకా!

రాత్రిళ్లు సామాజిక మాధ్యమాల వాడకంతో రక్తపోటు!

Eenadu.net Home