ఈ యాపిల్‌ ఉత్పత్తులు ఇక కనిపించవ్‌!

ప్రముఖ టెక్‌ సంస్థ యాపిల్‌ కంపెనీ సెప్టెంబరు 9న అతిపెద్ద ఈవెంట్‌ నిర్వహించనుంది. ఐఫోన్‌ 16 సిరీస్‌ ఫోన్లతో పాటు వాచ్ 10 సిరీస్‌ను లాంచ్‌ చేయనుంది.

ఏటా కొత్త ప్రొడక్టులను తీసుకురావడంతో పాటు కొన్ని ఉత్పత్తులను యాపిల్‌ నిలిపివేస్తుంటుంది. మరికొన్నింటిని కొత్త వాటితో రీప్లేస్‌ చేస్తుంది.

ఐఫోన్‌ 16 సిరీస్‌ లాంచ్ తర్వాత యాపిల్ తన ఐఫోన్‌ 15 ప్రో, ఐఫోన్‌ 15 ప్రో మ్యాక్స్‌ ఉత్పత్తులను పూర్తిగా నిలిపివేయనుంది.

యాపిల్‌ తొలిసారి పెద్ద స్క్రీన్‌తో తీసుకొచ్చిన 6.7 అంగుళాల ఐఫోన్‌ 14 ప్లస్‌ని కూడా నిలిపివేయనుంది.

కిందటి ఏడాది ఐఫోన్‌ 12ని యాపిల్‌ తన క్యాట్‌లాగ్‌ నుంచి తొలగించింది. ఈ ఏడాది ఐఫోన్‌ 16 రాకతో 13ను నిలిపివేయనున్నారు.

యాపిల్‌ వాచ్‌ అల్ట్రా 2కి బదులుగా అల్ట్రా 3ని లాంచ్‌ చేయనున్నారు. దీంట్లో కొత్తగా ఎస్‌ 10 అనే చిప్‌ను అమర్చినట్లు తెలుస్తోంది. దీంతో ఫిట్‌నెస్‌/ హెల్త్‌ ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి.

వాచ్‌ 10 సిరీస్‌ రాకతో వాచ్‌ 9 సిరీస్‌, ఎస్‌ఈ 2ను కూడా అధికారికంగా ఆపేయనున్నారు. ఇది పెద్ద డిస్‌ప్లేతోపాటు, కొత్త డిజైన్‌, లైట్‌ వెయిట్‌ ప్లాస్టిక్‌ కేస్‌తో రానుంది.

2019లో విడుదల చేసిన వైర్‌లెస్‌ యాపిల్‌ ఎయిర్‌పాడ్స్‌ 2 ఇక కనుమరుగు కానుంది. ఆధునిక ఫీచర్లతో ఎయిర్ పాడ్స్‌ 4ను తీసుకురానుండడమే ఇందుకు కారణం.

యాపిల్‌ ఐప్యాడ్‌ 10ను 2022లో లాంచ్‌ చేశారు. ప్రస్తుతం దీన్ని డిస్‌కంటిన్యూ చేసే అవకాశం ఉంది. దీని స్థానంలో కొత్త ఐప్యాడ్‌ రానుందని టెక్‌ వర్గాలు చెబుతున్నాయి.

 ఐపాడ్‌ మినీ 6ని 2021లో లాంచ్‌ చేసింది యాపిల్‌. దీన్ని ఐపాడ్ మినీ 7తో రీప్లేస్‌ చేసే అవకాశం ఉంది.

యాపిల్‌ వీటి ఉత్పత్తిని అధికారికంగా నిలిపివేసినా.. కొన్ని నెలల పాటు ఆఫ్‌లైన్‌లో యూజర్లకు అందుబాటులో ఉంటాయి. ఆ తర్వాత పూర్తిగా కనుమరుగుకానున్నాయి.

పిల్లలు విసిగిస్తున్నారని ఫోన్ ఇస్తున్నారా..?

అలాంటి పోస్టులు చేస్తే కఠిన చర్యలు తప్పవు!

ఎయిర్‌టెల్‌ ఓటీటీ ప్లాన్లు ఇవే..

Eenadu.net Home