#eenadu

ఆరోగ్యంగా ఉండాలంటే.. శరీరానికి అవసరమైన పోషకాలు సమృద్ధిగా అందాలి. అవి లోపిస్తే అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అవేంటో చూద్దామా..

ఐరన్‌

దీని లోపం వల్ల ఎనీమియా వస్తుంది. దీంతో అలసట, గుండెల్లో నొప్పితో పాటు శరీరం బలహీనంగా మారుతుంది.

అయోడిన్‌

దీని లోపంతో హైపోథైరాయిడిజమ్‌తో పాటు గాయిటర్‌ సమస్య తలెత్తుతుంది. దీంతో మలబద్ధకం, ముఖం ఉబ్బుగా మారడం, బరువుతో పాటు ఒత్తిడీ పెరుగుతుంది.

విటమిన్‌ ఎ

రేచీకటి వస్తుంది. కళ్లు పొడిబారడంతో పాటు చూపు మందగిస్తుంది. కళ్లలో కార్నియా పొర దెబ్బతింటుంది. చర్మం కూడా పొడిగా మారుతుంది.

విటమిన్‌ బి1

ఈ విటమిన్‌ లోపం తలెత్తితే బెరిబెరి వ్యాధి వస్తుంది. పాదాల తిమ్మిరి, నాడీ వ్యవస్థ, కండరాల బలహీనత వంటి సమస్యలు ఇబ్బంది పెడతాయి.

విటమిన్‌ సి

విటమిన్‌ సి లోపంతో స్కర్వీ వ్యాధి వస్తుంది. చిగుళ్ల నుంచి రక్తం కారుతుంది. రోగనిరోధక శక్తి తగ్గడంతోపాటు చర్మ వ్యాధులు వస్తాయి. గాయాలు తొందరగా మానవు.

విటమిన్‌ డి

శరీరంలో డి విటమిన్‌ తగ్గితే రికెట్స్‌ వ్యాధితో బాధపడాల్సి వస్తుంది. ఏ వయసు వారికైనా కీళ్ల నొప్పులు వస్తాయి. శ్రమపడకున్నా శరీరం అలసటకు గురవుతుంది. 

క్యాల్షియం

దీని లోపం వల్ల హైపోకాల్‌సెమియా డిజార్డర్‌ వస్తుంది. ఆందోళన, తికమక, గోళ్లు విరిగిపోవడం, జ్ఞాపకశక్తి మందగించడం వంటి సమస్యలు వస్తాయి.

మెగ్నీషియం

హైపోమెగ్నీషియం ఇబ్బంది పెడుతుంది. దీని వల్ల వాంతులు, వికారంతో పాటు ఒళ్లంతా సూదులు గుచ్చుతున్నట్లుగా అనిపిస్తుంటుంది.

ఈ లక్షణాలు కనిపిస్తే.. వెంటనే వైద్యులను సంప్రదించి.. తగిన చికిత్స తీసుకోవాలి. అప్పుడే అనారోగ్యాన్ని ఆదిలోనే అడ్డుకోవచ్చు. 

ఆహారమే ఔషధం..

కొబ్బరితో ఎన్నో లాభాలు..

సైకిల్‌ తొక్కితే ప్రయోజనాలు ఏంటి?

Eenadu.net Home