వందే భారత్‌ స్లీపర్‌ రైళ్లు.. ప్రత్యేకతలివీ..

వందేభారత్‌ స్లీపర్‌ రైళ్లను త్వరలోనే పట్టాలు ఎక్కించేందుకు రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో వందే భారత్‌ స్లీపర్‌ కోచ్‌ ప్రొటోటైప్‌ వెర్షన్‌ను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ఆవిష్కరించారు. ఆ రైళ్ల విశేషాలు ఇవీ.

బెంగళూరులోని భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (BEML) ఫెసిలిటీలో ప్రోటోటైప్‌ వందే భారత్‌ స్లీపర్‌ రైళ్లను ప్రారంభించారు. 

ఈ రైళ్ల స్లీపర్‌ కోచ్‌ల్లో రీడింగ్‌ ల్యాంప్స్‌, ఛార్జింగ్‌ అవుట్‌లెట్‌లు, స్నాక్స్‌ టేబుల్, మొబైల్‌/ మ్యాగజైన్‌ హోల్డర్స్‌ ఉంటాయి.

 రైల్వే ప్రమాదాలకు అడ్డుకట్ట వేసే ‘కవచ్‌’ వ్యవస్థ ఉంటుంది. 

స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ కార్‌ బాడీతో కోచ్‌లు సిద్ధం చేశారు. GFRP ఇంటీరియర్ ప్యానెల్స్ ఉంటాయి. 

 ఆటోమేటిక్‌ డోర్లు, మెరుగైన సదుపాయాలతో మరుగు దొడ్లు, కొత్త టెక్నాలజీతో రూపొందించిన సీటు కుషన్‌లు అమర్చారు. 

ఒక్కో రైలులో 16 కోచ్‌లు ఉంటాయి. మొత్తంగా 823 బెర్తులు ఉంటాయి.

11.. త్రీ టైర్‌ ఏసీ కోచ్‌లు (600 బెర్త్‌లు), నాలుగు 2 టైర్‌ ఏసీ కోచ్‌లు (188 బెర్త్‌లు), ఒక ఫస్ట్‌ టైర్‌ ఏసీ కోచ్‌(24 బెర్త్‌లు) ఉంటుంది.

సెమీ హైస్పీడ్‌ వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ఛైర్‌కార్‌ ఇప్పటికే అందుబాటులోకి రాగా.. స్లీపర్‌ రైళ్లు రెండో రకం. త్వరలో వందే మెట్రో రైలును కూడా తీసుకురానున్నట్లు సమాచారం.

ఒత్తిడిని దూరం చేసే ఆయిల్‌ మసాజ్‌

కోరుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఈ లక్షణాలు ఉండాలి!

ఆకర్షణీయమైన నగరాల్లో టాప్-10 ఇవే!

Eenadu.net Home