పాన్‌ లేకున్నా సిబిల్‌ స్కోర్‌.. ఎలా..?

క్రెడిట్‌ కార్డుల జారీతో పాటు రుణ దరఖాస్తు ప్రక్రియలో సిబిల్‌ స్కోర్‌ పాత్ర చాలా కీలకం.

క్రెడిట్‌ రేటింగ్‌ ఏజెన్సీల్లో ఒకటైన క్రెడిట్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో (ఇండియా) లిమిటెడ్‌ (CIBIL) రుణగ్రహీతల క్రెడిట్‌ స్కోర్‌ను అందిస్తూ ఉంటుంది.

ఈ సంస్థ పాన్‌కార్డ్‌ లేకున్నా కూడా క్రెడిట్ స్కోర్‌ను తెలుసుకొనే సదుపాయాన్ని అందిస్తోంది.

CIBIL వెబ్‌సైట్‌లో Personal CIBIL Score సెక్షన్‌లో Get your free CIBIL scoreపై క్లిక్‌ చేయాలి. ఆపై వేరే పేజీలోకి వెళ్తారు.

ఒకవేళ మీ వద్ద పాన్‌ లేకపోయినా పాస్‌పోర్ట్‌, ఓటర్‌ ఐడీ, డ్రైవింగ్‌ లైసెన్స్‌, రేషన్‌ కార్డ్‌.. ఇలా దేన్నైనా వినియోగించి సిబిల్‌ స్కోరు పొందొచ్చు.

అందులో అడిగిన వివరాలు పుట్టిన తేదీ, పిన్‌ కోడ్‌, రాష్ట్రాన్ని ఎంచుకొని మొబైల్‌ నంబర్‌ ఎంటర్‌ చేసి Accept and Continueపై క్లిక్‌ చేయాలి.

మొబైల్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్‌ చేసి Continueపై క్లిక్‌ చేయాలి.

మీ అకౌంట్‌కు డివైజ్‌ను లింక్‌ చేయాలా? వద్దా? అని అడుగుతుంది. అందులో మీకు నచ్చినది ఎంచుకోవచ్చు.

ఇలా రిజిస్ట్రేషన్‌ పూర్తయ్యాక Go to Dashboard ఆప్షన్‌పై క్లిక్‌ చేస్తే మీ సిబిల్ స్కోర్‌ డిస్‌ప్లే అవుతుంది.

డ్రై ప్రమోషన్‌.. కాఫీ బ్యాడ్జింగ్‌.. ఈ ట్రెండ్స్‌ తెలుసా?

మారుతీ సుజుకీ కొత్త స్విఫ్ట్‌ విశేషాలివీ..

ఉద్యోగంలో భవిష్యత్తునిచ్చే టాప్‌ 10 కంపెనీలివీ!

Eenadu.net Home