ఈపీఎఫ్‌ బ్యాలెన్స్‌ తెలుసుకోవాలా?

ఈపీఎఫ్‌ బ్యాలెన్స్‌ను తెలుసుకోవడానికి ఉన్న అనేక సదుపాయాల్లో UMANG యాప్‌ ఒకటి. దీని సాయంతో ఆన్‌లైన్‌లో సులువుగా మీ ఖాతాలో డబ్బు ఎంతుందో తెలుసుకోవచ్చు.

దీని కోసం UAN నంబర్‌, ఈపీఎఫ్‌ ఖాతాకు లింక్‌ అయిన మొబైల్‌ నంబర్‌ ఉంటే చాలు.

ముందుగా మీరు ఉమంగ్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని అందులో రిజిస్టర్‌ అవ్వాలి.

యాప్‌ ఓపెన్‌ చేశాక పైన కనిపించే సెర్చ్‌ బార్‌లో EPFO అని టైప్‌ చేసి ఈపీఎఫ్‌ఓ ఆప్షన్‌ ఎంచుకోవాలి.

 కింద కనిపించే ‘Service’ సెక్షన్‌లో ఉండే 'View Passbook' పై క్లిక్‌ చేయాలి.

స్క్రీన్‌పై కనిపించే ‘Employee-centric Service’ ఆప్షన్‌ ఎంచుకొని మీ UAN నంబర్ ఎంటర్ చేయాలి. 

తర్వాత రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్‌ చేయగానే మీ ఈపీఎఫ్‌ పాస్‌బుక్‌ కనిపిస్తుంది. అక్కడే మీ ఖాతా వివరాలు తెలుస్తాయి.

99660 44425 ఈ నంబర్‌కు ఈపీఎఫ్‌ రిజిస్టర్ట్‌ మొబైల్‌ నంబర్‌ నుంచి మిసిడ్‌ కాల్‌ ఇచ్చినా బ్యాలెన్స్‌ మెసేజ్‌ మీ మొబైల్‌కు వచ్చేస్తుంది.

7738299899 ఈ నంబర్‌కు ‘EPFOHO UAN ENG’ అని సందేశం పంపినా సరే ఎస్సెమ్మెస్‌ ద్వారా సమాచారం అందుకోవచ్చు.

యూపీఐలో ఈ ఏడాది వచ్చిన మార్పులు

వాట్సప్‌ ఈ ఏడాది బెస్ట్‌ ఫీచర్లు ఇవీ..

స్కామర్ల కామన్‌ డైలాగ్స్‌ ఇవీ!

Eenadu.net Home