బాలీవుడ్‌లోకి వెళ్తున్న కొత్త లేడీ విలన్‌

పదేళ్ల క్రితం తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ప్రగ్యా జైస్వాల్‌... ఇప్పుడు మళ్లీ బాలీవుడ్‌లోకి అడుగు పెడుతోంది. అక్కడ ఆమె కొత్త సినిమా రీసెంట్‌గా మొదలైంది.

అక్షయ్‌ కుమార్ ‘ఖేల్‌ ఖేల్‌ మే’లో ప్రగ్యా ఓ కీలక పాత్రలో నటిస్తోంది. అంతకుముందు 2014లో ‘టిట్టూ ఏంబీఏ’ అనే హిందీ సినిమా చేసిన సంగతి తెలిసిందే.

 ‘కంచె’, ‘అఖండ’ లాంటి హిట్‌ సినిమాలు చేసిన ప్రగ్యా జైస్వాల్‌ జోరు ఇప్పుడు తగ్గింది. తెలుగులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో ‘టైసన్‌ నాయుడు’ ఒక్కటే ఉంది. 

‘టైసన్‌ నాయుడు’లో ప్రగ్యా ప్రతి నాయిక ఛాయలున్న పాత్రలో నటిస్తోంది. టాలీవుడ్‌కి మంచి లేడీ విలన్‌ వస్తోంది అనేది టీమ్ మాట. 

This browser does not support the video element.

సంప్రదాయంగా ఉండటానికి ఇష్టపడే ప్రగ్యా... పట్టు చీరల్లోనే పార్టీలు, ఫంక్షన్లకు హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ ఉంటుంది. 

అలాగే ఫ్యాషన్‌గా కనిపించేటప్పుడు ఆమె డ్రెస్సింగ్‌ సెన్స్‌కి కుర్రకారు ఫిదా అయిపోతుంది. సోషల్‌ మీడియా షేక్‌ అవుతుంటుంది. 

This browser does not support the video element.

సోషల్‌ మీడియాలో ప్రగ్యా చాలా యాక్టివ్‌. ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్ల సంఖ్య 2.5 కోట్లకు పైమాటే.

నలుపు, ఎరుపు రంగులంటే ప్రగ్యాకి ఎంతో ఇష్టం. ఈ రంగుల దుస్తులతోనే ఎక్కువగా కనిపిస్తుంది.

చర్మం ఆరోగ్యంగా ఉండేందుకు అప్పుడప్పుడు ఐస్‌బాత్ చేస్తూ ఉంటుంది. దీంతో అందం, ఆరోగ్యం సొంతమవుతాయంటోంది.

విహార యాత్రలకు ప్లాన్‌ చేయాలంటే స్నేహితులతో కలసి మంచు ప్రదేశాలకే వెళ్తుంది. అక్కడ స్కేటింగ్‌ చేయడం నచ్చుతుందట.

This browser does not support the video element.

‘జంక్ ఫుడ్‌ ఎప్పుడో ఒకసారి తింటాను. వారానికి అయిదు రోజులు జిమ్‌ చేస్తాను’ అంటూ తన ఫిట్‌నెస్‌ రహస్యం బయటపెట్టింది.

 డ్యాన్స్‌ చేయడం, పారా గ్లైడింగ్ ఈమె హాబీలు. ఖాళీ సమయం దొరికితే స్విమ్మింగ్‌ చేస్తుంది. బీచ్‌లో ఆడుకోవడం వల్ల మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది అంటోంది.

శ్రద్ధా దాస్‌... రొయ్యల కూర.. భలే కాంబో

అల్లు అర్జున్‌ ఫిట్‌నెస్‌ సీక్రెట్స్‌

ఆ సినిమాలు బోర్‌ కొట్టవు!

Eenadu.net Home