వామ్మో చీరకట్టులో ఇన్ని రకాలా..!

తెలుగు రాష్ట్రాల్లో.. నివి చీర కట్టు

తెలుగింటి మహిళల చీరకట్టును నివి అంటారు. ఏ హంగు, ఆర్భాటం లేకుండా సాదాసీదా కట్టుతో హుందాగా కనిపించడం ఈ చీరకట్టు ప్రత్యేకత.  

తమిళనాడు, మడి కట్టు

పూజ చేసే సమయంలో మడి పద్ధతిలో చీర కట్టుకోవడం వినే ఉంటారు. క్రీ. పూ 2వ శతాబ్దం నుంచీ తమిళనాట ఈ పద్ధతి కొనసాగుతోంది. దీనికి తొమ్మిది గజాల చీరను ఉపయోగిస్తారు.

కర్ణాటక, కూర్గ్‌  

ఇక్కడ ఎక్కువగా కాంజీవరం చీరలను కూర్గ్‌ స్టైల్‌లో కట్టుకుంటారు. కొడవ చీరకట్టు అన్నా కూడా ఇదే.

మహారాష్ట్ర, నవ్వారి

ఈ స్టైల్‌లో చీర కట్టుకోవాలంటే దాదాపు తొమ్మిది గజాలు ఉండాలట. దీన్నే కాస్తా చీర అని కూడా అంటారు.

కేరళ, ముండుమ్ నెరియతుమ్‌

ఇక్కడి వారు తెలుపు రంగు, బంగారు వర్ణం అంచు ఉన్న చీరలనే ఎక్కువగా కట్టుకుంటారు. ముండుమ్‌ నెరియతుమ్‌ అంటే రెండు ముక్కల వస్ర్తం అని అర్థం. ఈ ముక్కల చీరను కసవు అని కూడా పిలుస్తారు.

గుజరాత్‌, సీదా పల్లు చీర

ఒడిశా, ఉత్తర్‌ ప్రదేశ్‌, గుజరాత్‌ ప్రాంతాల్లో ఈ చీరకట్టు ఎక్కువగా కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా ఈ స్టైల్‌ ప్రసిద్ధి చెందింది. 

 బెంగాల్‌, అట్పూర్‌

ఈ చీరకట్టు పశ్చిమ బెంగాల్‌ది. అస్సాంలో చేతితో నేసిన ఎరుపు రంగు అంచుతో ఉన్న తెలుపు చీరల్నే అధికంగా ధరిస్తారు. దీన్నే మేఖేలా స్టైల్‌ అనీ అంటారు. పండగల వేళ ఎక్కువగా ధరిస్తుంటారు. 

గోవా, కుంబి

గోవాలోని ఓ పురాతన తెగ పేరునే ఈ చీర స్టైల్‌కు పెట్టారు. ఈ శారీలను ఎక్కువగా ఎరుపు రంగు షేడ్‌లోనే తయారు చేస్తారు. ప్రస్తుతం వీటిని నేసే వారు, ధరించే వారి సంఖ్య చాలా వరకూ తగ్గింది.

వర్షాకాలంలో రోడ్‌ ట్రిప్‌.. ఈ దారుల్లో అద్భుతం..

ఒత్తిడిని జయించేందుకు నిపుణుల సలహాలివే..!

ట్రావెల్‌ డిటెక్టివ్‌.. ఆన్వీ కామ్‌దార్‌

Eenadu.net Home