ఎన్నేళ్లయినా ఇవి పాడవవు!

మనం తినే పదార్థాలు ఎప్పుడో ఒకప్పుడు పాడవుతాయి. కానీ, కొన్ని మాత్రం ఎన్నాళ్లయినా పాడవకుండా నిల్వ ఉంటాయి.

Source: Unsplash

తేనె


ఎన్ని ఏళ్లు అయినా పాడవకుండా ఉండే పదార్థం తేనె. ఎంత కాలమైన నిల్వ ఉంటుంది. తియ్యదనంలో ఎలాంటి మార్పు ఉండదు.

Source: Unsplash

ఉప్పు


ఏ వంటకమైనా ఉప్పు లేనిదే రుచిగా ఉండదు. ఆ ఉప్పు ఎంతకాలమైనా పాడవదు. పొడి డబ్బాలో తేమ తగలకుండా ఉంచాలి.

Source: Unsplash

చక్కెర


తేమ తగలకుండా నిల్వ చేయగలిగితే స్వచ్ఛమైన చక్కెర పాడవకుండా ఉంటుంది. వివిధ రూపాల్లో లభించే చక్కెర కాలక్రమంలో రూపం కోల్పోవచ్చు గానీ.. తియ్యదనాన్ని కోల్పోదు.

Source: Unsplash

బియ్యం


అన్నం పాడవుతుంది కానీ.. నిల్వ చేసిన బియ్యం ఎప్పటికీ పాడవవు. పైగా బియ్యం పాతపడ్డా కొద్ది మరింత నాణ్యంగా మారుతాయి.

Source: Unsplash

వెనిగర్‌


వైట్‌ వెనిగర్‌, ఆపిల్‌ సిడార్‌ వెనిగర్‌, రైస్‌ వెనిగర్‌ ఇలా అన్ని రకాల వెనిగర్లు ఏళ్లపాటు పాడవకుండా నిల్వ ఉంటాయట.

Source: Unsplash

మొక్కజొన్న పిండి


వంటకాల్లో వాడే మొక్కజొన్న పిండికి కూడా ఎక్స్‌పైరీ డేట్‌ లేదు. ఎంతకాలమైన నిల్వ ఉంటుంది. అయితే, పిండికి తేమ తగలకుండా పొడి డబ్బాల్లో నిల్వ చేయాలి.

Source: Unsplash

కాఫీ బీన్స్‌


కాఫీ బీన్స్‌, కాఫీ పొడి ఎన్ని ఏళ్లయినా పాడవవు. ప్యాకింగ్‌లో విక్రయించే కాఫీపొడి కూడా ఎన్ని నెలలు గడిచినా రుచిని కోల్పోదు.

Source: Unsplash

సోయా సాస్‌


చైనీస్‌ వంటకాల్లో ఎక్కువగా వాడే సోయా సాస్‌లో సోడియం ఉంటుంది. ఇది సాస్‌ను పాడవకుండా చూస్తుంది.

Source: Unsplash

మద్యం


మద్యంలో కొన్ని రకాల పానీయాలకు అసలు ఎక్స్‌పైరీ డేట్‌ ఉండదు. వాటిని ఎంతకాలం నిల్వ చేస్తే అంత నాణ్యంగా తయారవడమే కాదు.. డిమాండ్‌, ధర పెరుగుతాయి.

Source: Unsplash

చిక్కుళ్లు


ఎండబెట్టిన చిక్కుళ్లు ఎంతకాలమైనా పాడవకుండా ఉంటాయి. డబ్బాలో రెండేళ్లపాటు నిల్వ చేసి బయటకు తీసినా.. వాటిలోని పోషక విలువలు అలాగే ఉంటాయి.

Source: Unsplash

అవిసెలతో అనేక లాభాలు

ఇమ్యూనిటీని పెంచే డ్రింకులివి!

పదే పదే తీపి తినాలనిపిస్తుందా..!

Eenadu.net Home