#eenadu

ఉద్యోగాన్వేషణ కోసం ఎక్కువ మంది అన్వేషించే ప్లాట్‌ఫామ్‌ లింక్డిన్‌. అందులో ప్రొఫైల్‌ను ఆకర్షణీయంగా రూపొందించాలా? అయితే ఈ చిట్కాలు మీ కోసమే..

ప్రొఫైల్‌ అంటే వెంటనే గుర్తుకొచ్చేది ఫొటో. తొలుత అందరి దృష్టీ దీనిపైనే ఉంటుంది. అందుకే ప్రొఫైషన్‌ ప్రొఫైల్‌ ఫొటోను అప్‌లోడ్ చేయడం ముఖ్యం.

మీ ప్రొఫైల్‌ ఎంత ప్రొఫైషనల్‌ ఉంటే అంత ఆకర్షణీయంగా రిక్రూటర్లకు కనిపిస్తుంది. మీరు ఎంచుకున్న రంగానికి అనుగుణంగా మీ ప్రొఫైల్‌ ఉండాలి. దాన్ని ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేస్తుండాలి.

మీ అనుభవం, నైపుణ్యాలు, ప్రస్తుతం చేస్తున్న పని వివరాలు స్పష్టంగా ప్రొఫైల్‌లో పేర్కొనాలి. దీనికోసం ముఖ్యమైన కీవర్డ్‌లను ఉపయోగించండి.

మీరు కోరుకునే సంస్థల ప్రొఫైల్‌ను ఫాలో అవ్వండి. సదరు సంస్థల్లో ఏవైనా ఓపెనింగ్స్‌ ఉన్నా, కంపెనీకు సంబంధించిన సమాచారం తెలుసుకోవాలన్నా ఇది ఉపయోగపడుతుంది.

పెద్ద పెద్ద కంపెనీల హెచ్‌ఆర్‌ మేనేజర్లు, రిక్రూటర్లను అనుసరించండి. మీ నెట్‌వర్క్‌ను పెంచుకొనేందుకు ఇది సాయపడుతుంది.

లింక్డిన్‌లోని ‘ఓపెన్‌ టు నెట్‌వర్క్‌’ ఫీచర్‌ను యాక్టివేట్‌ చేయండి. దీంతో రిక్రూటర్లకు ఫలానా ప్రొఫైల్‌ ఉద్యోగాన్వేషణలో ఉందనే విషయం స్పష్టంగా తెలుస్తుంది.

లింక్డిన్‌లో మిమ్మల్ని మీరు నిరూపించుకునేందుకు ఆర్టికల్స్‌ను పబ్లిష్‌ చేస్తుండాలి. మీ పని చేస్తున్న రంగంపై మీకున్న జ్ఞానం, దానిపై ఉన్న అభిరుచి రిక్రూటర్లకు తెలుస్తుంది.

లింక్డిన్‌లోని ప్రొఫైషనల్‌ గ్రూప్‌లు జాయిన్‌ అవ్వండి. మీరున్న రంగంలో కొత్త పోకడలు తెలుసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది.

ఈ ఏడాది వచ్చిన బెస్ట్‌ ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్లు ఇవే..

సామాజిక మాధ్యమాలను సానుకూలంగానూ ఉపయోగించొచ్చు..

పిల్లలు విసిగిస్తున్నారని ఫోన్ ఇస్తున్నారా?

Eenadu.net Home