ఏడాదికోసారైనా ఈ వైద్య పరీక్షలు తప్పనిసరి!
ఆరోగ్యంగా ఉంటేనే జీవితం సజావుగా సాగిపోతుంది. మరి అలాంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే.. సమస్యలు ముదిరే వరకు చూడకుండా ముందుగానే గుర్తించి నివారించాలి.
Image: RKC
ఏడాదికోసారి కొన్ని ప్రాథమిక వైద్య పరీక్షలు చేయించుకోవడం వల్ల సమస్యలను గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు.
Image: RKC
బరువు
మీ ఎత్తుకు తగిన బరువు ఉన్నారో లేదో చూసుకోవాలి. ఎక్కువ బరువు ఉంటే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. వ్యాయామం, యోగా, ఆహారపు అలవాట్లలో మార్పులతో బరువును నియంత్రణలో ఉంచొచ్చు.
Image: RKC
రక్తపోటు(బీపీ)
ఇది దీర్ఘకాలికంగా వెంటాడే సమస్య. దీని వల్ల గుండె జబ్బులు వస్తాయి. ఇతర అవయవాలు దెబ్బతింటాయి. అందుకే తరచూ బీపీ చెక్ చేసుకోవాలి. ఇది నియంత్రణలో ఉండాలంటే ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించాలి. ఆహారంలో ఉప్పు తక్కువగా ఉండేలా చూసుకోవాలి.
Image: RKC
సంపూర్ణ రక్త పరీక్ష(సీబీసీ)
ఈ పరీక్ష ద్వారా శరీరంలో ప్రవహించే రక్తంలో ఏవైన సమస్యలుంటే బయటపడతాయి. రక్తహీనత ఉన్నట్లయితే ఐరన్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి. పరిస్థితి తీవ్రంగా ఉంటే వైద్యుల సూచన మేరకు మందులు వాడొచ్చు.
Image: RKC
షుగర్ టెస్ట్
రక్తంలో గ్లూకోజ్, కొలెస్ట్రాల్ స్థాయులు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి. వీటి స్థాయులు పెరిగితే మధుమేహం బారిన పడే ప్రమాదముంది. ముందుగానే గుర్తిస్తే ఆహారం, జీవనశైలిలో మార్పులు చేసుకొని నివారించవచ్చు.
Image: RKC
థైరాయిడ్
జీవక్రియల్లో ముఖ్య భూమిక పోషించే థైరాయిడ్ గ్రంథి పనితీరు ఎలా ఉందో తెలుసుకోవాలి. సమస్య ఉంటే వెంటనే మందులు ఉపయోగించి సరిచేసుకోవాలి.
Image: RKC
మామోగ్రామ్
మహిళలు 40ఏళ్ల వయసుకు వచ్చాక ఏడాదికోసారైనా మామోగ్రామ్ పరీక్ష చేయించుకోవాలి. ఇది బ్రెస్ట్ క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించే పరీక్ష. దీని వల్ల ఆ క్యాన్సర్ బారిన పడకుండా జాగ్రత్త పడొచ్చు.
Image: RKC
పాప్ స్మియర్
ఈ పరీక్ష గర్భాశయ క్యాన్సర్‌ను గుర్తించడానికి చేస్తారు. ముప్పై ఏళ్లు పైబడిన మహిళలు ప్రతి ఐదేళ్లకోసారైనా ఈ పరీక్ష చేయించుకోవాలి.
Image: RKC
ప్రొస్టేట్
మగవారిలో వచ్చే ప్రొస్టేట్ క్యాన్సర్‌ను గుర్తించేందుకు ఈ పరీక్ష చేస్తారు. నలభైఏళ్లు పైబడిన వారు ఈ పరీక్ష చేయించుకోవాలి. దీని వల్ల క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించే వీలుంటుంది.
Image: RKC