రిపేర్‌ @ హోమ్‌

మొబైల్‌ ఫోన్‌ పనిచేయకపోతే సర్వీస్‌ సెంటర్‌ వెతుక్కుని వెళ్లాల్సిన అవసరం లేదు. కంపెనీలే పికప్‌, డ్రాప్‌ సౌకర్యాలను అందిస్తున్నాయి. ఆ వివరాలు ఇవీ..

శాంసంగ్‌ (Samsung)

శాంసంగ్‌ అందిస్తున్న పికప్‌, డ్రాప్‌ సర్వీస్‌కు రూ.199 వసూలు చేస్తోంది. డ్రాప్‌ సర్వీస్‌కు అయితే రూ.99 చెల్లించాల్సి ఉంటుంది. 1800 572 67864 వాట్సప్‌ నంబర్‌కు మెసేజ్‌ చేసి సర్వీస్‌ బుక్‌ చేసుకోవచ్చు.

షావోమీ (Xiaomi)

షావోమీ, రెడ్‌మీ, పోకోకు చెందిన ఫోన్లు రిపేర్‌ వస్తే షావోమీ పికప్‌-డ్రాప్‌ సౌకర్యం ఉంటుంది. దీని కోసం రూ.199+జీఎస్టీ, పికప్‌, డ్రాప్‌ సేవలకు రూ.99+ జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది.

వన్‌ప్లస్‌ (OnePlus)

1800 102 841 కస్టమర్‌ కేర్‌ నంబర్‌కు చేసి వన్‌ప్లస్‌ ఫోన్ల పికప్‌, డ్రాప్‌ సర్వీసులను ఎంచుకోవచ్చు.

లావా (Lava)

లావా కేర్‌ యాప్‌ ద్వారా మొబైల్‌ సర్వీస్‌ బుక్‌ చేయొచ్చు. 1860 500 5001 కాల్‌ సెంటర్‌ నంబర్‌, 92890 65050 వాట్సప్‌ నంబర్‌కు మెసేజ్‌ చేయడం ద్వారా హోమ్‌ సర్వీస్‌ సేవల్ని పొందొచ్చు.

వివో (Vivo)

వివో పికప్‌, డ్రాప్‌ సర్వీసుల్ని అందిస్తోంది. 1800 208 3388, 1800 102 3388 కస్టమర్‌ కేర్‌ నంబర్‌ ద్వారా పికప్‌, డ్రాప్‌ సర్వీసులను బుక్‌ చేసుకోవచ్చు.

ఒప్పో (OPPO)

పికప్‌, డ్రాప్‌ సర్వీసులకు ఒప్పో ఇండియా రూ.250+ జీఎస్టీ ఛార్జీ వసూలు చేస్తోంది. 1800 103 2777 హెల్ప్‌ లైన్‌ నంబర్‌ ద్వారా సర్వీసులను బుక్‌ చేసుకోవచ్చు.

పికప్‌- డ్రాప్‌ సర్వీసులు అన్ని పిన్‌కోడ్‌లకూ వర్తించకపోవచ్చు. మీ ప్రాంతంలో ఈ సేవల అందుబాటులో ఉన్నాయో లేదో తెలుసుకునేందుకు ఆయా కంపెనీల అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.

పర్సే కాదు.. ఫోనూ లెదరే!

గూగుల్‌ మ్యాప్సే కాదు.. ఇవీ ఉన్నాయ్‌!

వీటితో డిజిటల్‌ అరెస్టుకు చెక్‌!

Eenadu.net Home