ఆండ్రాయిడ్‌ యూజర్లకు కొత్త ఫీచర్లు

ఆండ్రాయిడ్‌ యూజర్ల కోసం గూగుల్‌ సరికొత్త ఫీచర్లను ప్రకటించింది. మీ రోజువారీ అవసరాలను ఈ ఫీచర్లు సులభతరం చేయబోతున్నాయని గూగుల్‌ తెలిపింది.

ఎడిట్‌

వాట్సప్‌ తరహాలోనే గూగుల్‌ తన మెసేజింగ్‌ యాప్‌లో ఎడిట్‌ ఆప్షన్‌ను పరిచయం చేసింది. దీంతో సందేశం పంపిన 15 నిమిషాల్లోపు ఎడిట్‌ చేసేయొచ్చు. 

రీమిక్స్‌ చేయొచ్చు

ఎమోజీలను రీమిక్స్‌ చేసే సదుపాయం త్వరలో రానుంది. రెండు, మూడు ఎమోజీలను కలిపి స్టిక్కర్‌గా పంపొచ్చు.

గూగుల్‌ ‘హోమ్‌’

ఇంట్లో ఎక్కువగా వినియోగించే స్మార్ట్‌ వస్తువులను గూగుల్‌ హోమ్‌ ద్వారా నియంత్రించొచ్చు. ఇందులో మీకు నచ్చిన వాటిని ఎంచుకుని హోమ్‌ స్క్రీన్‌పై విడ్జెట్స్‌గా పెట్టుకోవచ్చు.

వేర్‌ ఓఎస్‌ వాచ్‌తో

గూగుల్‌ తీసుకొచ్చిన వేర్‌ ఓఎస్‌ స్మార్ట్‌వాచ్‌తోనూ ఇంట్లోని స్మార్ట్‌ పరికరాలను కంట్రోల్‌ చేయొచ్చు. లైట్లను ఆఫ్‌ చేయడం, డోర్‌ను అన్‌లాక్‌ చేయడం లాంటివి చేయొచ్చు.

ఒక్క క్లిక్‌తో

ఒక్క క్లిక్‌తో ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్లు, క్రోమ్‌ బుక్‌ వంటి డివైజెస్‌ను మీ మొబైల్‌ హాట్‌స్పాట్‌కు కనెక్ట్‌ చేసేలా ఇన్‌స్టంట్‌ హాట్‌స్పాట్‌ ఫీచర్‌ త్వరలో రానుంది. దీనికి పాస్‌వర్డ్‌ ఎంటర్‌ చేయాల్సిన అవసరం ఉండదు.

మధ్యలోనే స్విచ్

గూగుల్‌ మీట్‌ కాల్‌ మధ్యలో ఇతర డివైజ్‌లకు లేదా వెబ్‌ బ్రౌజర్‌కు మారాల్సి వస్తే ఒక్క క్లిక్‌తో మారిపోవచ్చు. సింగిల్‌ క్లిక్‌ ద్వారా స్విచ్‌ అయ్యే ఈ సదుపాయం కూడా త్వరలో రానుంది.

సామాజిక మాధ్యమాలను సానుకూలంగానూ ఉపయోగించొచ్చు..

లింక్డిన్‌ ప్రొఫైల్‌ ఆకర్షణీయంగా రూపొందించాలా?

పిల్లలు విసిగిస్తున్నారని ఫోన్ ఇస్తున్నారా?

Eenadu.net Home