ఈ టిప్స్‌తో మొబైల్‌ బ్యాటరీ ఆదా

మొబైల్‌ను ఉదయం ఫుల్‌ ఛార్జ్‌ చేస్తే సాయంత్రానికి బ్యాటరీ అయిపోతోందంటూ చాలా మంది చెప్తుంటారు. ఆ పరిస్థితి రాకూడదంటే.. ఈ టిప్స్‌ పాటించండి.

స్క్రీన్‌ బ్రైట్‌నెస్‌ను తగ్గించడం లేదా ఆటో అడ్జెస్ట్‌ మోడ్‌ను ఎంచుకుంటే బ్యాటరీ ఎక్కువ సమయం వస్తుంది.

బ్యాటరీ సేవర్‌ ఆప్షన్‌ పవర్‌ మోడ్‌ను ఎనేబుల్‌ చేసుకోండి. ఛార్జింగ్‌ తక్కువ ఉన్న సమయంలో ఫోన్‌ ఛార్జింగ్‌ త్వరగా అవ్వకుండా ఉండేందుకు ఇది సాయపడుతుంది.

బ్యాటరీ లైఫ్‌ని తగ్గించే బ్లూటూత్‌, వైఫై, జీపీఎస్‌ ఫీచర్లు అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఆన్‌ చేయండి. 

వాడకపోయినా బ్యాగ్రౌండ్‌లో రన్‌ అవుతూ బ్యాటరీని తగ్గించే యాప్‌లు కొన్ని ఉంటాయి. ఆటోస్టార్ట్‌ / బ్యాగ్రౌండ్‌ ఆప్షన్‌లో వాటిని ఆఫ్‌ చేయగలరు.

డార్క్‌/నైట్‌ మోడ్‌ను ఎనేబుల్‌ చేసుకోండి. ఆమోలెడ్‌ స్క్రీన్‌ ఉన్న ఫోన్‌లో డార్క్‌ థీమ్స్‌ను ఉపయోగిస్తే తక్కువ బ్యాటరీ ఖర్చవుతుంది.

మొబైల్‌ ఆపరేటింగ్‌ సిస్టం, యాప్‌లను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయడం ముఖ్యం. బ్యాటరీ పనితీరు మెరుగుపరచడానికి సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌లూ సాయపడతాయి.

ఏ యాప్‌లు ఎక్కువ బ్యాటరీని వినియోగిస్తున్నాయో తెలుసుకోండి. వాటిని ఆప్టిమైజ్‌ చేయండి.

మెసేజ్‌, మెయిల్‌, బ్రేకింగ్‌ న్యూస్‌.. అంటూ ఇలా స్క్రీన్‌పై కనిపించే నోటిఫికేషన్‌లు బ్యాటరీ లైఫ్‌ని తగ్గించేస్తాయి. అందుకే అవసరం ఉన్న వాటికి మాత్రమే పుష్‌ నోటిఫికేషన్‌లను ఎనేబుల్‌ చేసుకోండి.

అక్టోబర్‌లో రానున్న ఫోన్లు ఇవే..!

లింక్డిన్‌ ప్రొఫైల్‌ ఆకర్షణీయంగా రూపొందించాలా?

శాటిలైట్‌ నావిగేషన్‌ వ్యవస్థలివీ!

Eenadu.net Home