మీ బ్యాగ్‌లో ఇవి ఉన్నాయా!

బయటకు వెళ్లినప్పుడు ఇబ్బంది పడకుండా ఉండాలంటే కొన్నింటిని వెంట తీసుకొని వెళ్లక తప్పదు. మరి తప్పనిసరిగా బ్యాగ్‌లో ఉండాల్సినవేంటో తెలుసుకుందాం. 

image:RKC

ఛార్జర్‌..

బ్యాగ్‌లో కచ్చితంగా ఎక్కడికి వెళ్లినా ఛార్జర్‌ ఉండాలి. ఏదైనా పని మీద బయటకు వెళ్లినప్పుడు ఫోన్లో ఛార్జింగ్‌ అయిపోతే ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకే ఎటెళ్లినా ఛార్జర్‌ వెంట తీసుకెళ్లాలి.

 image:RKC

వాటర్‌ బాటిల్‌..

బయటికి వెళ్లినప్పుడు తప్పనిసరిగా వాటర్‌ బాటిల్‌ తీసుకెళ్లాలి. ప్రతి గంటకోసారి నీళ్లు తాగుతూ ఉండాలి. దీంతో తొందరగా అలసిపోకుండా ఉంటారు.

image:RKC

స్నాక్స్‌..

తినేందుకు ఏదైనా స్నాక్స్‌ తప్పనిసరిగా బ్యాగ్‌లో పెట్టుకోవాలి. బయట కొన్న ఆహారం కన్నా ఇంట్లో ఆహారం తీసుకెళ్లడం మంచిది.

image:RKC

కొంత డబ్బు..

ప్రస్తుతం అన్ని లావాదేవీలు డిజిటల్‌ అయిపోయాయి. దీంతో నగదు వెంట తీసుకెళ్లడం తగ్గిపోయింది. కానీ డిజిటల్‌ విధానంలో కొన్నిసార్లు ఇబ్బందులు తలెత్తవచ్చు. అందుకే బ్యాగ్‌లో కొంత డబ్బును ఉంచుకోవాలి.

image:RKC

కార్డ్‌లు..

ఎక్కువగా ఉపయోగించే కార్డులను బ్యాగ్‌లో వెంట తెచ్చుకోవాలి. ఆధార్‌, పాన్‌, ఏటీఎం, క్రెడిట్‌ కార్డులు దగ్గర పెట్టుకోవాలి. అవసరం ఉన్నప్పుడు ఇబ్బంది పడకుండా ఉండొచ్చు.

image:RKC

ఫస్ట్‌ ఎయిడ్‌ బాక్స్‌..

బ్యాగ్‌లో ఫస్ట్‌ ఎయిడ్‌ బాక్స్‌ ఉంచుకోవాలి. గాయాలైనప్పుడు ఉపయోగపడుతుంది. ఇతరులకు అవసరం ఉన్నా అందించవచ్చు.

image:RKC

పుస్తకం, పెన్ను..

మీ బ్యాగ్‌లో ఎప్పుడూ ఒక చిన్న పుస్తకం, పెన్ను వెంట ఉంచుకోండి. మీ ఆలోచనలను ఎప్పటికప్పుడు అందులో రాసుకోండి. ఇది మంచి అలవాటు.

image:RKC

రాష్ట్రానికో ఫేమస్‌ రైస్‌ డిష్‌!

ప్రపంచంలోని టాప్‌-10 ప్రశాంతమైన దేశాలివే!

ప్రపంచంలోనే ఎక్కువ సమయం పట్టే విమాన ప్రయాణాలు

Eenadu.net Home