ఏదైనా కొనే ముందు ఈ ప్రశ్నలు వేసుకోండి!

ఈ వస్తువును ఎందుకు కొనాలి? దానితో అవసరముందా? లేదా మార్కెట్లోకి కొత్తగా వచ్చిందనో, ఆఫర్‌ ఉందనో కొంటున్నామా?

Image: Pixabay

కొన్న వస్తువు ఎంతకాలం ఉంటుంది? పాడయితే మరమ్మతు చేస్తే పని చేస్తుందా? మళ్లీ కొత్తది కొనాలా?

Image: Pixabay

ఈ వస్తువుని ఎన్నిసార్లు ఉపయోగిస్తాం? తరచూ ఉపయోగించేదేనా? ఒక్కసారికే అయితే కొనడం ఎంత వరకు సబబు

Image: Pixabay

కొన్న వస్తువు జీవితకాలం పనికొస్తుందా? కొన్నాళ్లకు మూలకి పడేసేదేనా?

Image: Pixabay

కొత్త వస్తువు కొనే బదులు అద్దెకు తీసుకోవడం లేదా సెకండ్‌ హ్యాండ్‌లో కొనుగోలు చేసే వీలు ఉందా?

Image: Pixabay

అప్పు/క్రెడిట్‌ కార్డుతో కాకుండా దగ్గర ఉన్న డబ్బుతో వస్తువును కొనగలమా?

Image: Pixabay

వస్తువు ధరపై ఆరా తీశామా? చెప్పిన రేటుకే కొంటున్నామా?

Image: Pixabay

నిజంగా ఇప్పుడు ఈ వస్తువును కొనాల్సిన అవసరముందా?

Image: Pixabay

ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకొని.. వాటికి అనుగుణంగా కొనుగోలు చేస్తే అనవసర ఖర్చుల నుంచి తప్పించుకోవచ్చు.

Image: Pixabay

ప్రపంచంలోనే బిజియెస్ట్ ఎయిర్‌పోర్ట్స్‌

ఇండియాకు +91 కోడ్‌ ఎలా వచ్చింది?

టెస్లా గురించి మీకివి తెలుసా?

Eenadu.net Home