ఆరోగ్య బీమా తీసుకుంటున్నారా? ఇవి గుర్తుంచుకోండి!
ప్రాంతాన్ని బట్టి ఆస్పత్రి ఖర్చుల్లో మార్పులుంటాయి. వాటికనుగుణంగా.. మీ వార్షిక ఆదాయాన్ని బట్టి బీమా కవరేజీ మొత్తాన్ని ఎంపిక చేసుకోవాలి.
Image: Eenadu
బీమా ప్రీమియం అనేది వయసుతోపాటు పెరుగుతుంది. ఎంత త్వరగా బీమా తీసుకుంటే అంత లాభదాయకంగా ఉంటుంది.
Image: Eenadu
ఏ సంస్థ పాలసీ ప్రీమియం తక్కువగా ఉంటుందో తెలుసుకునేందుకు ఇప్పుడు ఆన్‌లైన్‌లో అనేక వెబ్‌సైట్లు అందుబాటులో ఉన్నాయి. వాటిపై ఆరా తీయాలి.
Image: Eenadu
పాలసీ తీసుకునే ముందు బీమా సంస్థ నెట్ వర్క్ ఆసుపత్రుల జాబితాను చూడాలి. మీరు నివసించే ప్రాంతానికి దగ్గరలో ఉన్న ఆసుపత్రులు బీమా సంస్థ జాబితాలో ఉన్నాయో లేదో తెలుసుకోవాలి.
Image: Eenadu
బీమా సంస్థల క్లెయిమ్ సెటిల్మెంట్ రేట్ పరిశీలించి.. ఏ కంపెనీకి ఎక్కువగా ఉందో దాన్ని ఎంచుకోవడం మేలు.
Image: Eenadu
సంస్థ పాలసీ నియమ, నిబంధనలను క్షుణ్ణంగా చదవాలి. లేదంటే క్లెయిమ్ చేసే సమయంలో ఇబ్బందులు ఎదురవుతాయి.
Image: Eenadu
ఆరోగ్య బీమా తీసుకునే సమయంలో స్వీయ, కుటుంబ ఆరోగ్య చరిత్రను వెల్లడించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆరోగ్య సమస్యలను దాచకూడదు.
Image: Eenadu
గతంలో ఏవైన వ్యాధులుండి చికిత్స తీసుకుంటుంటే, బీమా కంపెనీలు వెయిటింగ్ పీరియడ్‌ని అమలు చేస్తాయి. ఆ సమయంలో ఏదైనా అయితే బీమా హామీ ఉండదు.
Image: Pixabay
నో క్లెయిమ్ బోనస్‌ను ఏ విధంగా ఇస్తున్నారో తెలుసుకోవాలి. కొన్ని సంస్థలు బీమా హామీ మొత్తాన్ని పెంచితే.. మరికొన్ని ప్రీమియంను తగ్గిస్తాయి.
Image: Eenadu