ప్రజా ప్రతినిధులు..
అభినయ తారలు
ప్రియమణి - కస్టడీ
వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగచైతన్య నటించిన ‘కస్టడీ’లో ప్రియమణి ముఖ్యమంత్రిగా కనిపించింది.
Image: Instagram
కేథరిన్ ట్రెసా - సరైనోడు
‘యూ ఆర్ మై ఎంఎల్‌ఏ.. ’ అంటూ ‘సరైనోడు’లో అల్లు అర్జున్ కేథరిన్ కోసం పాట పాడుతాడు. ఇందులో కేథరిన్ ఎమ్మెల్యే పాత్ర పోషించింది.
Image: Instagram
కృతి శెట్టి - బంగార్రాజు
నాగార్జున ‘సోగ్గాడే చిన్ని నాయనా’కు సీక్వెల్‌గా ‘బంగార్రాజు’ తెరకెక్కింది. ఇందులో నాగచైతన్య కూడా నటించాడు. చైతుకి జోడీగా, ఊరికి ప్రెసిడెంట్ అవ్వాలని పరితపించే అమ్మాయిగా కృతి శెట్టి నటించింది.
Image: Instagram
త్రిష - ధర్మయోగి (తమిళ్‌లో కోడి)
ధనుష్ ద్విపాత్రభినయం చేసిన పొలిటికల్ డ్రామా ‘ధర్మయోగి’. ఇందులో త్రిష రాజకీయంగా పైకి ఎదగడానికి ఏమైనా చేసే వ్యక్తిగా కనిపిస్తుంది. ప్రతినాయిక ఛాయలున్న పాత్రలో త్రిష నటించి మెప్పించింది.
Image: Instagram
నయనతార - గాడ్‌ఫాదర్
మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్’లో నయనతార కీలక పాత్ర పోషించింది. మొదటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్నా.. చివరికీ తన తండ్రి పార్టీ పగ్గాలు స్వీకరించి.. ముఖ్యమంత్రి అవుతుంది.
Image: Instagram
రమ్యకృష్ణ - క్వీన్, రిపబ్లిక్
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలిలత జీవితం ఆధారంగా రూపొందించిన ‘క్వీన్’ వెబ్‌సిరీస్‌లో రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో నటించింది. సాయిధరమ్‌తేజ్ ‘రిపబ్లిక్’లోనూ రాజకీయ నాయకురాలిగా మెరిసింది.
Image: Instagram
కంగనా రనౌత్ - తలైవీ, ఎమర్జెన్సీ
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ కూడా తమిళనాడు దివంగత సీఎం జయలిలత బయోపిక్ ‘తలైవీ’లో నటించి మెప్పించింది. ప్రస్తుతం ‘ఎమర్జెన్సీ’లో ఇందిరా గాంధీ పాత్ర పోషిస్తోంది.
Image: Instagram
కత్రినా కైఫ్ - రాజ్‌నీతి
బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ప్రకాశ్ ఝా తెరకెక్కించిన ‘రాజ్‌నీతి’లో కత్రినా కైఫ్ రాజకీయ నాయకురాలిగా నటించింది. రాజకీయ ఎత్తుగడలతో సాగే ఈ చిత్రంలో కత్రినా మధ్యప్రదేశ్ సీఎం అవుతుంది.
Image: Instagram
రవీనా టాండన్ - కేజీఎఫ్
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ నటించిన ‘కేజీఎఫ్’ సిరీస్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ‘కేజీఎఫ్ 2’లో రవీనా టాండన్ ప్రధాన మంత్రి ‘రమికా సేన్’ పాత్ర పోషించి ఆకట్టుకుంది.
Image: Instagram
హ్యూమా ఖురేషీ - మహారాణి
బాలీవుడ్ పొలిటికల్ డ్రామా వెబ్‌సిరీస్ ‘మహారాణి’. ఇందులో హ్యూమా ఖురేషీ రాజకీయ నాయకురాలిగా నటించింది. ఇప్పటి వరకు 2 సీజన్లు వచ్చాయి.
Image: Instagram
వరలక్ష్మి శరత్‌కుమార్ - సర్కార్
వరలక్ష్మి శరత్‌కుమార్ అటు తమిళ్, ఇటు తెలుగులో విభిన్న పాత్రలు పోషిస్తూ విలక్షణ నటిగా గుర్తింపు తెచ్చుకుంది. విజయ్ ‘సర్కార్’లో ప్రతినాయకుడి కుమార్తెగా, రాజకీయ నాయకురాలిగా నటించి మెప్పించింది.
Image: Instagram