భారత్‌లో ఎత్తయిన విగ్రహాలు ఏవో తెలుసా..?

సర్దార్‌ వల్లభ భాయ్‌ పటేల్‌..

ప్రపంచంలోకెల్లా ఎత్తయిన ఈ విగ్రహం వల్లభభాయ్‌పటేల్‌(statue of unity)ది. గుజరాత్‌లోని నర్మదానదీ తీరాన ఉంది. ఎత్తు 597 అడుగులు. స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో, ఆ తర్వాత ప్రజలను ఐక్యంగా ఉంచేందుకు కృషి చేసిన పటేల్‌ స్మృతిగా దీన్ని నిర్మించారు. 

image: unsplash

శ్రీ రామానుజాచార్య..

భారత్‌లో రెండో అతిపెద్ద విగ్రహం రామానుజాచార్య(statue of equality)దే. ఇది హైదరాబాద్‌లో ఉంది. 11వ శతాబ్దంలో సమానత్వాన్ని చాటి చెప్పిన రామానుజాచార్యకి గుర్తుగా 216 అడుగుల ఎత్తులో దీన్ని నిర్మించారు. 

హనుమాన్‌..

ఆంధ్రప్రదేశ్‌లోని నరసన్నపేటలో 176 అడుగుల ఎత్తుతో హనుమాన్‌ విగ్రహాన్ని నిర్మించారు. ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ-హైదరాబాద్‌ హైవేలో పరిటాల దగ్గరలో మరో ఆంజనేయ స్వామి విగ్రహం 135 అడుగుల ఎత్తులో ఉంది. 

మురుగన్‌..

తమిళనాడులో 146 అడుగుల ఎత్తుతో పుత్రిగౌండపాళయం అనే ట్రస్టు అధికారులు మురుగన్‌ విగ్రహాన్ని నిర్మించారు. మలేషియాలో ఉన్న మురుగన్ విగ్రహానికంటే ఇది ఆరు అడుగుల ఎత్తు ఎక్కువే. 

వైష్ణోదేవి..

మాతా వైష్ణో దేవి 141 అడుగుల ఎత్తుతో ఉత్తర్‌ప్రదేశ్‌లో కొలువై ఉంది. అమ్మవారి విగ్రహం ముందు ఆంజనేయుడు కూర్చుని ఉన్న మరో విగ్రహం ఉంది. దీని ఎత్తు 26 అడుగులు. 

వల్లువర్‌..

తమిళ కవి వల్లువర్‌కి గుర్తుగా 133 అడుగుల ఎత్తుతో కన్యాకుమారి నదీ తీరాన దీన్ని నిర్మించారు. సముద్రకోత నుంచి భూమిని ఇది కాపాడుతుందని విశ్వసిస్తారు. చాలామంది ఈ విగ్రహాన్ని త్రివల్లువర్‌ స్టాచ్యూ అని కూడా అంటారు. 

గౌతమ బుద్ధ

ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతిలో గౌతమ బుద్ధుడి విగ్రహం ఉంది. ఇక్కడ బుద్ధుడు ధ్యాన ముద్రలో కూర్చుంటాడు. 125 అడుగుల ఎత్తుతో కృష్ణానదీ తీరాన ఉంది. నాలుగున్నర ఎకరాల్లో ఉన్న ఈ విగ్రహం పర్యటక ప్రాంతంగా అభివృద్ధి చెందింది. 

ఆది యోగి..

తమిళనాడులోని కోయంబత్తూరులో ఆదియోగి విగ్రహాన్ని 112 అడుగుల ఎత్తు 147 అడుగుల వెడల్పుతో నిర్మించారు. దీన్ని జగ్గీ వాసుదేవ్‌ డిజైన్‌ చేశారు. దీనికోసం దాదాపు 500 టన్నుల స్టీలు ఉపయోగించారట. 

జటాయువు..

ప్రపంచంలోనే అతి ఎత్తయిన పక్షి విగ్రహం ఏదంటే అది జటాయువుదే. కేరళలోని చడ్యా మంగళం అనే ప్రాంతంలో ఉంది. 200 అడుగుల పొడవు, 150 అడుగుల వెడల్పు, 70 అడుగుల ఎత్తుతో జటాయువు విగ్రహాన్ని నిర్మించారు. 

దిల్లీలోని హనుమాన్‌..

జన్‌దేవాలన్‌ మెట్రో స్టేషన్‌ పక్కన 108 అడుగుల ఎత్తుతో హనుమాన్‌ కొలువుదీరాడు. ఈ ప్రాంతంలో ఎక్కువగా సినిమా చిత్రీకరణలు జరుగుతూ ఉంటాయి.

ఆషాఢంలోనే ఇన్ని నియమాలు ఎందుకు పాటిస్తారు..?

జగన్నాథుడి రథయాత్ర విశేషాలివీ!

అమర్‌నాథ్‌ యాత్ర విశేషాలివీ..

Eenadu.net Home