సాహసాల మోదీ!

ప్రధాని నరేంద్ర మోదీ అనేక రకాల విన్యాసాలు చేస్తూ అభిమానులను, ప్రజలను ఆశ్చర్యపరుస్తున్నారు. కజిరంగ నేషనల్ పార్కులో ఆయన ఏనుగుపై చేసిన సఫారీ ప్రస్తుతం వైరల్ అవుతోంది. 

ద్వారకలోని పంచకుయ్‌ బీచ్‌లో మోదీ స్కూబా డైవింగ్‌ చేశారు. సముద్ర గర్భంలో ఉన్న ప్రాచీన ద్వారక నగరాన్ని సందర్శించి తన్మయులయ్యారు. పద్మాసనం వేసి, తన వెంట తెచ్చుకున్న నెమలి పింఛాలను శ్రీకృష్ణునికి కానుకగా సమర్పించారు.

లక్షద్వీప్‌లో పర్యటించిన మోదీ అక్కడ స్నార్కెలింగ్‌ చేశారు. సముద్రం లోపలికి వెళ్లి అక్కడి జీవరాశులను వీక్షించారు. 

This browser does not support the video element.

‘మ్యాన్‌ వర్సెస్‌ వైల్డ్‌’ కార్యక్రమంలో బేర్‌గ్రిల్స్‌తో పాటు మోదీ అడవిలో గడిపి అందరినీ విస్మయానికి గురిచేశారు.

బంధిపుర్‌లోని అటవీ ప్రాంతాన్ని, జీవ వైవిధ్యాన్ని సందర్శిస్తున్న ప్రధాని.

కేదార్‌నాథ్‌లో ధ్యానం కోసమే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గుహలో మోదీ ఓ రోజు రాత్రంతా గడిపారు. 

This browser does not support the video element.

తేజస్‌ యుద్ధ విమానంలో ప్రయాణించిన మోదీ... ఈ ప్రయాణం ఒక ప్రత్యేక అనుభవాన్ని పంచిందని తన ఇన్‌స్టా ద్వారా పంచుకున్నారు. 

వర్షాకాలంలో రోడ్‌ ట్రిప్‌.. ఈ దారుల్లో అద్భుతం..

ఒత్తిడిని జయించేందుకు నిపుణుల సలహాలివే..!

ట్రావెల్‌ డిటెక్టివ్‌.. ఆన్వీ కామ్‌దార్‌

Eenadu.net Home