కుక్క కరిస్తే ఏం చేయాలో తెలుసుకోండి...!
పెంపుడు కుక్కయినా, వీధిలోని కుక్కయినా కరిస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్లాల్సిందే. లేకపోతే తీవ్ర ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కుక్క కరిస్తే ఏం చేయాలంటే...!
image:RKC
వీధి కుక్క కరిస్తే చాలా అప్రమత్తంగా ఉండాలి. వెంటనే సాధారణ నీటితో గాయాన్ని శుభ్రం చేయాలి. 15 నిమిషాల పాటు ధారగా పడుతున్న నల్లా నీటితో కడగాలి.
image:RKC
ఇంట్లో ఉంటే యాంటీసెప్టిక్ లోషన్‌తో గాయాన్ని శుభ్రం చేయాలి. ఆ తర్వాత ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా ఆసుపత్రికి వెళ్లాలి.
image:RKC
గతంలో లాగా యాంటీ రేబీస్ వ్యాక్సిన్ బొడ్డు చుట్టూ వేయడం లేదు. ఐదు ఇంజిక్షన్లు భుజానికే వేస్తున్నారు.
image:RKC
రేబీస్ వస్తే ముందుగా నరాలపై ప్రభావం చూపుతుంది. అక్కడి నుంచి వైరస్ మెదడుకు చేరుతుంది. ఆ పరిస్థితుల్లో నరాలు చచ్చుబడి పోయే ప్రమాదం ఉంది.
image:RKC
రేబీస్ ఇన్‌ఫెక్షన్ అయితే గాయమయిన చోట నొప్పి అధికంగా ఉంటుంది. గాయం నుంచి రక్తం బాగా కారుతుంది. చీము పడుతుంది. జ్వరంతో పాటు తల తిరిగినట్టు ఉంటుంది.
image:RKC
పొరపాటున రేబీస్ వచ్చినపుడు ఆధునిక చికిత్స చేయడానికి వైద్యం అందుబాటులోకి వచ్చింది. కుక్క కరిచిన కొంతకాలం పాటు గమనించి అనుమానిత లక్షణాలు బయట పడితే ఆసుపత్రికి వెళ్లాలి..
image:RKC
కుక్క కరవక ముందు టెటానస్ టీకా వేయించుకుంటే ఇన్‌ఫెక్షన్ వచ్చే ప్రమాదం చాలా తక్కువగా ఉంటుంది. కనీసం ఐదేళ్లకోసారి ఈ టీకా వేసుకోవడంతో ఏ గాయాలయినా తొందరగా మానిపోతాయి.
image:RKC
కుక్కకాటుకు గురైన వారిలో కొంతమంది అతిగా స్పందిస్తారు. మరికొందరు కుక్కలా దిక్కులు చూస్తారు. మెదడు పనితీరు మందగిస్తుంది. సొంతంగా ఏ పని చేయలేని స్థితికి వస్తారు.
image:RKC
ఇంటి దగ్గర పెంచుకునే కుక్కకు క్రమం తప్పకుండా మూడేళ్లకోసారి వ్యాక్సిన్ వేయించాలి. లేకపోతే పిల్లలు ఆడుకునే సమయంలో అది కరిస్తే ఇబ్బందులు వస్తాయి.
image:RKC