అమ్మాయిలూ.. పెళ్లికి సిద్ధమయ్యారా? ఇవి గుర్తుంచుకోండి!


పెళ్లి.. ప్రతి ఒక్కరి జీవితంలో ఓ మధురమైన ఘట్టం. అమ్మాయిలకు మరింత ప్రత్యేకం. మరి పెళ్లికి సిద్ధమయ్యే అమ్మాయిలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.

 image:RKC 

పెళ్లికి ఎలా ముస్తాబవ్వాలో ముందే ఓ అంచనా వేసుకోవాలి. వీలైతే చీరలు.. వాటికి తగిన మ్యాచింగ్‌ వస్తువులు కాస్త ముందే కొనాలి. లేదంటే పెళ్లి సమయంలో ఇబ్బంది పడాల్సి వస్తుంది. 

 image:RKC

అందరికంటే భిన్నంగా ఉండాలని ప్రీ-వెడ్డింగ్‌ షూట్‌లో రిస్క్‌ చేసి సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. కాబట్టి.. ఫొటో షూట్‌ సమయంలో జాగ్రత్తగా ఉండండి.

image:RKC

ఎన్ని పనులు ఉన్నా.. కడుపు నిండా తినాలి. కంటి నిండా నిద్ర పోవాలి. అప్పుడే ముఖం కాంతిమంతంగా అందంగా కనిపిస్తుంది.

 image:RKC

హల్దీ వేడుకల్లో పసుపు, మెహందీ ఎంపికలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నాణ్యమైన వాటిని ఎంచుకోవాలి. లేదంటే చర్మ సమస్యలు తలెత్తుతాయి.

 image:RKC

పిన్నులు, హెయిర్‌ పిన్నులు సమయానికి దొరకకుండా ఇబ్బంది పెడతాయి. అందుకే అన్నీ ఒక మేకప్‌ బ్యాగ్‌లో వేసి అందుబాటులో ఉంచుకోండి.  

image:RKC

ఎక్కడున్నా వాటర్‌ బాటిల్‌ వెంట ఉంచుకోవాలి. ఎక్కువగా నీటిని తీసుకోవాలి. కుదిరితే పండ్ల రసాలు తాగాలి. ఇవి ఆరోగ్యాన్ని మాత్రమే కాదు. అందాన్ని కూడా పెంచుతాయి.

image:RKC

స్నేహితులు, బంధువులకు ముందుగానే పెళ్లి ఆహ్వానాన్ని పంపేయండి. పనుల్లో పడి మర్చిపోతారు.

image:RKC

అత్తారింటి వాళ్లు ఎలా ఉంటారో, వారితో ఎలా కలిసిపోవాలో అని అమ్మాయిలు ఆలోచిస్తుంటారు. అందమైన దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టే ముందు ఈ అనవసరపు ఆలోచనలను మనసులోకి రానివ్వొద్దు.

image:RKC

అందంగా ఉండేందుకు.. సహజపద్ధతులివే!

ఇండోర్ ప్లాంట్స్‌.. ప్రయోజనాలు ఇవే!

సన్నని నడుము కోసం ఇలా చేయండి!

Eenadu.net Home