పాదాలను సంరక్షించుకోండిలా!

చాలామంది అందంగా కనిపించేందుకు ముఖానికి రకరకాల లేపనాలు పెడుతుంటారు. చేతులు కాళ్ల గురించి పట్టించుకోరు. పాదాలపై అసలు ధ్యాస కూడా ఉండదు. కానీ పాదాలు అందంగా ఆరోగ్యంగా ఉండాలంటే వాటి మీద కాస్త శ్రద్ధ పెట్టాల్సిందే! 

image:Pixabay

చిన్న చిన్న పనులు చేస్తూ పాదాలను అందంగా ఉంచుకోవచ్చు. మొదటగా.. పాదాలను బయటకు వెళ్లి వచ్చిన ప్రతిసారి తప్పనిసరిగా నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. 

image:Pixabay

కేవలం ముఖానికి, చేతులకి మాత్రమే కాదు. కాళ్లకి, పాదాలకు కూడా మాయిశ్చరైజర్‌ రాసుకోవాలి. 

image:Pixabay

చలికాలంలో చర్మం పొడిబారుతుంటుంది. పాదాలు పగులుతాయి. అందువల్ల బయటకు వెళ్లినప్పుడు షూ వేసుకోవడమే ఉత్తమం.ఇలా చేయడం వల్ల దుమ్ము ధూళి నుంచి కాపాడుకోవచ్చు. 

image:Pixabay

రాత్రి పడుకునే ముందు కొబ్బరి నూనెను రాసుకొని పడుకోండి. దీంతో పాదాలు మృదువుగా ఉంటాయి. 

image:Pixabay

చలికి పాదాలు నిర్జీవంగా తయారవుతాయి. అందువల్ల పాదాలకు సాక్సులు ధరించి పడుకోవటం మంచిది. 

image:Pixabay

కాలి గోళ్లకు అందమైన రంగులను వేసుకోండి. ఇవి మీ అందానికి మరింత వన్నె తెస్తాయి. కానీ ఈ గోళ్ల రంగులను ఎంపిక చేసుకోవటంలో జాగ్రత్తలు తీసుకోవాలి. నాణ్యమైనవి మాత్రమే వాడాలి. 

image:Pixabay

బయట నుంచి వచ్చాక గోరు వెచ్చని నీటిలో కాస్త ఉప్పు వేసి పాదాలను 10 నిమిషాల పాటు ఉంచాలి. దీంతో పాదాలకు విశ్రాంతి లభిస్తుంది. 

image:Pixabay

వీలైతే ఇంట్లోనే పెడిక్యూర్‌ చేసుకోండి. గోళ్లను ఎప్పటికప్పుడు కత్తిరించుకోండి. కాస్త శ్రద్ధ పెడితే చాలు.. మీ పాదాలు అందంగా, ఆరోగ్యంగా ఉంటాయి.

image:Pixabay

తులిప్‌ గార్డెన్‌.. విశేషాలు తెలుసా?

ఏప్రిల్‌ 16 చార్లీ చాప్లిన్‌ జయంతి

ఏకాంతాన్ని ఆస్వాదించండి..

Eenadu.net Home