#eenadu

 వర్షాకాలంలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల జుట్టు ఊడిపోవడం, చుండ్రు, పొడిబారడం, చిక్కులు పడటం వంటి సమస్యలు తలెత్తుతాయి. వాటిని నివారించాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే!

వర్షంలో తడిచినప్పుడు జుట్టులో సూక్ష్మక్రిములు చేరి వాసన వస్తుంది. దీన్ని నివారించాలంటే వారానికి కనీసం రెండు, మూడు సార్లు తలస్నానం చేయాలి. 

వర్షాకాలంలో సాధారణ టవల్‌కు బదులు మైక్రోఫైబర్‌ టవల్‌ ఉపయోగిస్తే మంచిది. తలస్నానం చేసిన తర్వాత తలపై బలంగా రుద్దకుండా సున్నితంగా తుడిస్తే జుట్టు రాలకుండా ఉంటుంది.

తడి జుట్టు దువ్వడం అనేది పెద్ద తప్పు. కుదుళ్లు వదులుగా మారి దెబ్బతింటాయి. తల పూర్తిగా ఆరిన తర్వాతే దువ్వాలి. లేకపోతే కురులు ఊడిపోవడం ఖాయం.

తల స్నానానికి ముందు నూనె రాయాలి. దీంతో తలకు పోషణ అందుతుంది. మాడుకు మసాజ్‌ చేయడం ద్వారా రక్తప్రసరణ పెరుగుతుంది కురులు దృఢంగా మారతాయి.

జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే సరైన ఉత్పత్తులను ఎంచుకోవాలి. తలస్నానం చేసిన తర్వాత జుట్టుకు కండిషనర్‌ను వాడాలి. దీని ద్వారా జుట్టు చిక్కులు పడకుండా మృదువుగా ఉంటుంది.

హెయిర్‌ డ్రయర్‌, స్ట్రెయిట్‌నర్‌ వంటివి వానాకాలంలో వాడకపోవడమే మంచిది. వీటి వల్ల జుట్టు నిర్జీవంగా, పొడిగా మారుతుంది.

జడ బిగుతుగా వేసుకోవడం ద్వారా జుట్టు కుదుళ్లపై ఒత్తిడి పడి దెబ్బతింటాయి. వీలైనంత వదులుగా అల్లుకోవాలి.

ఏ కాలమైనా శరీరం డీ హైడ్రేట్‌ కాకుండా చూసుకోవాలి. శరీరంలో నీటి శాతం తగ్గితే జుట్టుపైనా ఆ ప్రభావం పడుతుంది.

వీటన్నింటితో పాటు జుట్టును కాపాడుకోవడానికి పోషకాహారం కూడా ముఖ్యమే. ఆకుకూరలు, నట్స్‌, గుడ్లు తినడం ద్వారా కురులకు పోషణ అందుతుంది. 

రాష్ట్రానికో ఫేమస్‌ రైస్‌ డిష్‌!

ప్రపంచంలోని టాప్‌-10 ప్రశాంతమైన దేశాలివే!

ప్రపంచంలోనే ఎక్కువ సమయం పట్టే విమాన ప్రయాణాలు

Eenadu.net Home