కళ్లద్దాల వాడకంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
ముఖానికి సరిపోవడం లేదనో, ఫ్యాషన్‌గా లేవనో కంటి సమస్యలున్నా కూడా కొందరు కళ్లద్దాలు ధరించరు.
#Pixabay
దీని వల్ల మీ కంటి చూపు క్రమంగా దెబ్బతింటుంది. అప్పుడప్పుడూ కాకుండా మీ చూపు మెరుగవ్వడానికి నిరంతరం కళ్లద్దాల వాడకం తప్పనిసరి.
#Pixabay
మురికిగా ఉన్న కళ్లద్దాలతో చూడటం వల్ల విజన్ సరిగా లేక కంటి చూపు మరింత మందగిస్తుంది.
#Pixabay
మీ సైట్‌కు సంబంధంలేని, ఇతరుల కళ్లద్దాలు ధరించొద్దు. దీంతో కళ్లపై ఒత్తిడి పడి తలనొప్పి వస్తుంది.
#Pixabay
మీకు ఫిట్ అయ్యే కళ్లద్దాలే తీసుకోవాలి. బరువు, వదులుగా ఉంటే చికాకు కలుగుతుంది.
#Pixabay
సూర్యుడి నుంచి వెలువడే అల్ట్రావైలెట్ కిరణాలు కళ్లతో పాటు వాటి చుట్టూ ఉన్న చర్మానికి హాని కలుగజేస్తాయి.
#Pixabay
అందువల్ల యూవీ ప్రొటెక్షన్ లెన్స్‌లు ఉన్న కళ్లద్దాలు ధరించడం ఉత్తమం.
#Pixabay
కంప్యూటర్ ముందు ఎక్కువ సేపు పని చేసేవారు బ్లూ లైట్ లెన్స్ ఉన్న కళ్లద్దాలను వాడాలి.
#Pixabay
యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్ లెన్స్ వల్ల కళ్లపై ఒత్తిడి పడకుండా ఉంటుంది.
#Pixabay
కళ్లద్దాలు వాడే అలవాటు ఉన్నవారు కనీసం ఏడాదికోసారైనా కంటి పరీక్షలు చేయించుకోవాలి.
#Pixabay