ఫుడ్ పాయిజనింగ్ కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఆహారం వండే పాత్రలు, గరిటెలను శుభ్రంగా కడగాలి. అలా చేయకపోతే వాటిలో వండిన ఆహారం కలుషితమయ్యే ప్రమాదం ఉంది.
Source:pixabay
వండే ముందు, తర్వాత కిచెన్ ప్లాట్‌ఫామ్‌ను శుభ్రం చేయడం చాలా ముఖ్యం.
Source:pixabay
ఆహారం వండే ముందు, తినే ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. Source:pixabay
ఆహారం వండి వార్చే క్రమంలోనూ సరైన పరిశుభ్రతా ప్రమాణాలను పాటించాలి. Source:pixabay
వండిన ఆహార పదార్థాలు లేదా మిగిలిపోయిన పదార్థాల్ని రెండు గంటల్లోపే ఫ్రిజ్‌లో పెట్టాలి. అది కూడా 5 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద మాత్రమే నిల్వ చేయాలి.
Source:pixabay
పదార్థాల్ని పచ్చిగా తినడం కంటే ఉడికించుకొని తినడమే మంచిది. తద్వారా వాటిపై ఉండే బ్యాక్టీరియా శరీరంలోకి చేరకుండా జాగ్రత్తపడొచ్చు.
Source:pixabay
మార్కెట్ నుంచి తీసుకొచ్చిన కూరగాయలు, ఆకుకూరల్ని ముందుగా ఉప్పు/పసుపు వేసిన నీటిలో కడగడం ఉత్తమం.
Source:pixabay
పచ్చి మాంసంపై ఉండే ఈ.కొలి, ఇతర బ్యాక్టీరియా ఫుడ్ పాయిజనింగ్‌కు దారితీసే ప్రమాదం ఉంది. కాబట్టి వాటిని ఇతర కాయగూరలు, పండ్లతో కాకుండా విడిగా తీసుకురావాలి.
Source:pixabay