#eenadu

ఈ రోజుల్లో చాలా మంది ఎదుర్కొంటున్న సమస్యల్లో లోబీపీ ఒకటి. దీనిని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు అంటున్నారు నిపుణులు.

 అడ్రినల్‌ హార్మోన్‌ స్థాయుల హెచ్చుతగ్గులు, మద్యం, మాదకద్రవ్యాలు అతిగా తీసుకోవడం, రక్తం గడ్డకట్టడం ద్వారా లోబీపీ తలెత్తుతుంది.

 లోబీపీతో బాధపడేవారు ఎప్పుడూ నీరసంగా, తల తిప్పడం, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలతో ఉంటారు. 

తగినంత నీరు, పళ్లరసాలు, తాగుతూ ఉండాలి. ముఖ్యంగా కొబ్బరినీళ్లలో ఉండే ఎలక్ట్రోలైట్లు బీపీని సమ స్థాయిలో ఉంచుతాయి.

లోబీపీతో బాధపడేవారు అధిక వ్యాయామం చేయకూడదు. వాకింగ్‌, చిన్న చిన్న బరువులెత్తడం, ధ్యానం, యోగా వంటివి చేయాలి. దీని ద్వారా మెదడుకు రక్తప్రసరణ పెరిగి ప్రశాంతంగా అనిపిస్తుంది. 

బీపీ తక్కువ అయినప్పుడు ఒక కప్పు కాఫీ లేదా టీ తీసుకుంటే ఉపశమనం లభిస్తుందని మీకు తెలుసా..! అలా కూడా మోతాదుకు మించి తీసుకోకూడదు. 

 లోబీపీ ఉన్నవారు ఆహారంలో ఉప్పు సరిపడా తీసుకోవాలి. ఉప్పు ఎక్కువైనా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. 

ఆకుకూరలు, గుడ్లు, లివర్‌, పప్పు ధాన్యాలు, ఐరన్‌ అధికంగా ఉండే అరటిపండ్లు, పాలకూర తినడం ద్వారా ఈ సమస్యను దూరం చేయవచ్చు. 

లోబీపీతో బాధపడేవారు ఒత్తిడి, కుంగుబాటుకు గురికాకూడదు. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతూ ఉండాలి. అలసటగా అనిపిస్తే విశ్రాంతి తీసుకోవాలి.

సైకిల్‌ తొక్కితే ప్రయోజనాలు ఏంటి?

డ్రైఫ్రూట్స్‌ను పచ్చిగా తీసుకోవాలా, నానబెట్టి తినాలా?

రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు ఈ పానీయాలు ట్రై చేయండి

Eenadu.net Home