క్రెడిట్‌ స్కోరు పెంచే 8 టిప్స్‌

ఓ వ్యక్తి ఆర్థిక విషయాల్లో ఎలా వ్యవహరిస్తున్నారనేది తెలుసుకోవడంలో క్రెడిట్‌ స్కోరుది కీలక పాత్ర. 750 లేదా అంతకంటే ఎక్కువ క్రెడిట్‌ స్కోరుంటే మెరుగైన పరిస్థితిలో ఉన్నట్లే లెక్క.

కొత్త రుణాలు తీసుకోవాలనుకున్నప్పుడు ఈ క్రెడిట్ స్కోరు ముఖ్య భూమిక పోషిస్తుంది. తక్కువ వడ్డీకే రుణాలు పొందేందుకూ వీలుంటుంది. కాబట్టి, మంచి క్రెడిట్‌ స్కోరు ప్రతి ఒక్కరికీ ముఖ్యం. దాన్ని పెంచుకోవాలంటే.?

క్రెడిట్‌ స్కోరును ఎప్పటికప్పుడు చెక్‌ చేసుకోవడం మొదటి అంశం. తరచూ చెక్‌ చేయడం వల్ల స్కోరుపై ప్రతికూల ప్రభావం చూపే పొరపాట్లు, తప్పులను సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది.

మీ క్రెడిట్‌ వినియోగాన్ని మొత్తం అందుబాటులో ఉన్న పరిమితిలో 30 శాతం మించకుండా చూసుకోండి. దీన్నే సీయూఆర్‌ రేషియోగా పేర్కొంటారు.

 మీ రుణాలు, కార్డు బిల్లును సకాలంలో చెల్లించండి. అప్పుడే ఆరోగ్యకరమైన క్రెడిట్‌ చరిత్ర సాధ్యమవుతుంది.

క్రెడిట్‌ కార్డు కోసం గానీ, రుణానికి గానీ వరుసగా ప్రయత్నించడం వల్ల క్రెడిట్‌ స్కోరుపై ప్రతికూల ప్రభావం పడుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.

ఎన్నిసార్లు దరఖాస్తు చేసినా క్రెడిట్‌ కార్డు మంజూరు కాకపోతే.. ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసి, దానికి అనుబంధంగా క్రెడిట్‌ కార్డును తీసుకోవచ్చు. అప్పు విషయంలో బంగారం కుదువ పెట్టి తీసుకోవడం ఉత్తమం.

దీర్ఘకాలం పాటు మెరుగైన రుణ చరిత్ర కలిగిన క్రెడిట్‌ కార్డులను ఎట్టిపరిస్థితుల్లోనూ మూసివేయొద్దు. మీ దగ్గర కార్డులను తగ్గించాలీ అనుకుంటే కొత్త వాటిని ఎంపిక చేసుకోండి.

తనఖా, ఆటో, వ్యక్తిగత రుణాలు.. ఇలా విభిన్న రుణాలు ఉంటే మీ క్రెడిట్ స్కోరు మెరుగవుతుంది.

 క్రెడిట్‌ స్కోరును నిర్మించాలనుకునే వారు తక్కువ క్రెడిట్‌ పరిమితితో ప్రాథమిక క్రెడిట్‌ కార్డును పొందండి. కార్డును జాగ్రత్తగా వాడడం మొదలు పెడితే స్కోరు క్రమంగా పెరుగుతుంది.

మార్కెట్లో మదుపు చేస్తున్నారా? ఇవి తెలుసా..

విజేతలు చెప్పిన సూత్రాలు మీకోసం..

ఎన్టీపీసీ గ్రీన్‌ ఎనర్జీ ఐపీఓ.. కీ పాయింట్స్‌

Eenadu.net Home