ల్యాప్‌టాప్ బ్యాటరీ లైఫ్ పెరగాలంటే..
మొబైల్/ల్యాప్‌టాప్‌లో బ్యాటరీని ఎక్కువగా వాడుకునేది స్క్రీన్ భాగం. కాబట్టి.. ఇంట్లో/ఆఫీసులో ఉన్నప్పుడు స్క్రీన్ బ్రైట్‌నెస్‌ను తగ్గించుకోండి. బయటకు వెళ్లినప్పుడు మాత్రమే పెంచుకుంటే సరి.
Image: Pixabay
ప్రస్తుత విండోస్ ఓఎస్‌లలో పవర్ సేవింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. మీరు పవర్ సేవింగ్స్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి తగిన ఆప్షన్స్‌ను ఎంచుకోవాలి.
Image: Pixabay
ల్యాప్‌టాప్‌లో వైఫై, బ్లూటూత్ వంటి కనెక్టివిటీ ఫీచర్స్ వినియోగంలో లేనప్పుడు ఆఫ్ చేయాలి. ఇవి బ్యాటరీని ఎక్కువగా వినియోగించుకుంటాయి.
Image: Pixabay
ల్యాప్‌టాప్‌నకు ఎక్స్‌టర్నల్ కీబోర్డు, మౌస్, హార్డ్‌వేర్ డ్రైవ్స్, వెబ్‌క్యామ్స్ వినియోగిస్తుంటారు. వీటి వల్ల కూడా బ్యాటరీ త్వరగా అయిపోతుంటుంది. వీటితో పని పూర్తయిన వెంటనే తొలగించడం ఉత్తమం.
Image: Pixabay
అనవసరమైన సాఫ్ట్‌వేర్లను డౌన్‌లోడ్ చేసుకోకండి. అలాగే, అరుదుగా ఉపయోగించే యాప్స్‌ను డిసేబుల్ చేయండి. లేదంటే ఇవి బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతూ బ్యాటరీకి భారంగా మారతాయి.
Image: Pixabay
ల్యాప్‌టాప్‌ను వీలైనంత వరకు వేడెక్కకుండా చూసుకోవాలి. వేడి పెరిగితే.. అది బ్యాటరీపై ప్రభావం చూపుతుంది. కాబట్టి కాస్త గాలి ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో ల్యాప్‌ని వినియోగించాలి. లేదా కూలింగ్ ప్యాడ్స్‌ను వాడొచ్చు.
Image: Pixabay
బ్యాటరీ పూర్తిగా అయిపోయే వరకు చూడకండి. కనీసం 20శాతం ఉన్నప్పుడే ఛార్జింగ్ పెట్టండి. అలాగే, 100శాతం దాటినా ఛార్జింగ్ కొనసాగిస్తే బ్యాటరీ తొందరగా పాడయ్యే అవకాశముంది.
Image: Pixabay
ఎక్స్‌టర్నల్ బ్యాటరీ ప్యాక్‌ను వెంట ఉంచుకోవడం మేలు. ఎక్కువగా బ్యాటరీ వినియోగం అయ్యే చోట వీటిని వినియోగించుకోవచ్చు.
Image: Pixabay
అప్పుడప్పుడు బ్యాటరీ పనితీరును చెక్ చేయాలి. బ్యాటరీ దెబ్బతింటే వెంటనే మార్పించాలి.
Image: Pixabay