మీ మొబైల్‌ సేఫ్‌గా ఉండాలంటే.. ఈ జాగ్రత్తలు పాటించండి!

మొబైల్‌కు పిన్‌/ఫేస్‌/ ఫింగర్‌ప్రింట్‌/ పాస్‌వర్డ్‌తో లాక్‌స్క్రీన్‌ సెట్‌ చేసుకోవాలి. దీని వల్ల ఇతరులు మీ మొబైల్‌ను యాక్సెస్‌ చేయలేరు.

Source: Pixabay

మొబైల్‌లో మీ గూగుల్‌ అకౌంట్‌ భద్రంగా ఉందో లేదో గూగుల్‌ సెక్యూరిటీలో తరచూ చెక్‌ చేసుకోవాలి.

Source: Pixabay

ప్లేస్టోర్‌/యాప్‌స్టోర్‌ కాకుండా థర్డ్‌ పార్టీ సైట్ల నుంచి యాప్స్‌ను అస్సలు డౌన్‌లోడ్‌ చేయొద్దు.

Source: Pixabay

యాప్స్‌కు అనుమతులు ఇవ్వడంలో జాగ్రత్త వహించాలి. అనవసరమైన అనుమతులను ఇవ్వొద్దు.

Source: Pixabay

పబ్లిక్‌ వైఫైను వీలైనంత వరకూ వాడకపోవడం ఉత్తమం. లేదంటే మొబైల్‌ హ్యాక్‌కు గురయ్యే ప్రమాదముంది.

Source: Pixabay

అనుమానాస్పద మెయిల్స్‌, మెసేజ్‌లను ఓపెన్‌ చేయొద్దు. అలాంటివి వచ్చినప్పుడు డిలీట్‌ చేయండి. పొరబాటున క్లిక్‌ చేస్తే సైబర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయొచ్చు.

Source: Pixabay

నమ్మదగిన వెబ్‌సైట్స్‌ నుంచే మీకు కావాల్సిన వివరాలను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. తెలియని, నకిలీ వెబ్‌సైట్స్‌ జోలికి వెళ్లకూడదు.

Source: Pixabay

మొబైల్‌లో యాంటీవైరస్‌ సాఫ్ట్‌వేర్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని తరచూ మొబైల్‌లోని యాప్స్‌, ఫైల్స్‌ను స్కాన్‌ చేయాలి.

Source: Pixabay

ముఖ్యమైన యాప్స్‌నకు ‘టూ ఫ్యాక్టర్‌ ఆథెంటికేషన్‌’ ఎనేబుల్‌ చేసుకోవాలి. దీని వల్ల అదనపు భద్రత లభిస్తుంది.

Source: Pixabay

మొబైల్‌లో ‘ఫైండ్‌ మై డివైజ్‌’ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసి పెట్టుకోండి. ఇది మీ మొబైల్‌ పోతే కనిపెట్టేందుకు ఉపయోగపడుతుంది.

Source: Pixabay

మొబైల్‌ సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌గా ఉండేలా చూసుకోవాలి.

Source: Pixabay

పిల్లలు విసిగిస్తున్నారని ఫోన్ ఇస్తున్నారా..?

అలాంటి పోస్టులు చేస్తే కఠిన చర్యలు తప్పవు!

ఎయిర్‌టెల్‌ ఓటీటీ ప్లాన్లు ఇవే..

Eenadu.net Home