జుట్టు తెల్లబడుతోందా? ఇవిగో పరిష్కారాలు!
జుట్టు కుదుళ్లలో మెలనిన్ ఉత్పత్తి తగ్గిపోతే వెంట్రుకలు తెలుపు రంగులోకి మారతాయి. వంశపారంపర్యం, పోషకాహార లోపం, కొన్ని జీవనశైలి అలవాట్లతోనూ తెల్ల జుట్టు రావొచ్చు. ఈ సమస్యకు పరిష్కారాలున్నాయి. అవేంటంటే..
Image: Unsplash
కాఫీ పొడిని నీళ్లలో మరిగించి.. చల్లారిన తర్వాత దాన్ని జుట్టుకు పట్టించాలి. 45 నిమిషాల తర్వాత కడగాలి. తరచూ ఇలా చేస్తే జుట్టు నలుపు రంగులోకి మారుతుంది.
Image: Pixabay
కొబ్బరి నూనెలో కరివేపాకు లేదా ఉసిరి, మెంతిపొడులు కలిపి కాగబెట్టుకోవాలి. దీన్ని తరచూ జుట్టుకు రాసుకుంటే ఫలితం ఉంటుంది.
Image: Pixabay
క్యారెట్ జ్యూస్‌లో నువ్వుల నూనె, మెంతిపొడి వేసి.. రోజు మార్చి రోజు తలకు పట్టించి, కాసేపయ్యాక తలస్నానం చేయాలి. ఇది జుట్టు రంగు మారడంలో సాయపడుతుంది.
Image: Pixabay
రాత్రంతా నానబెట్టిన మెంతుల్ని, బాగా మరిగించిన కరివేపాకును కలిపి పేస్ట్ చేయాలి. దాన్ని కుదుళ్లకు పట్టించి.. అరగంట తర్వాత తలస్నానం చేయాలి.
Image: Pixabay
మందార ఆకు పేస్ట్‌లో కొబ్బరి నూనె కలుపుకొని జుట్టుకు పట్టించుకోవాలి. 2 గంటల తర్వాత కడగాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే తెల్ల జుట్టు సమస్య తగ్గుముఖం పడుతుంది.
Image: Pixabay
గోరింటాకు పొడిని పేస్ట్‌లా చేసి జుట్టుకు పట్టించి.. కొంతసేపటి తర్వాత కడిగేస్తే సరి. ఇది తెల్ల జుట్టు రాకుండా నివారించడమే కాదు.. జుట్టు రాలే సమస్యనూ తగ్గిస్తుంది.
Image: Pixabay
ఉసిరి పొడిని తీసుకొని దాన్ని కొబ్బరి నూనెలో కలిపి ఈ మిశ్రమాన్ని వేడి చేసి చల్లార్చాలి. దాన్ని జుట్టుకు రాసుకొని అరగంట తర్వాత తలస్నానం చేయాలి.
Image: Pixabay
బాదం నూనెలో నువ్వులపొడి వేసి తరచూ తలకు రాస్తుండాలి. ఇలా చేయడం వల్ల తెల్ల జుట్టు నల్లగా మారుతుంది.
Image: Pixabay
వీటితో పాటు జుట్టుకు ఎండ తగిలేలా చూడాలి. దీని వల్ల మెలనిన్ ఉత్పత్తి అయి, జుట్టు నల్లగా మారడానికి తోడ్పడుతుంది.
Image: Pixabay