ఫ్రిజ్‌ వాడటమే కాదు.. నిర్వహణ కూడా ముఖ్యమే!

కూరగాయలు, పాలు, పండ్లు, గుడ్లు, తినగా మిగిలిపోయిన కూరలను ఫ్రిడ్జ్‌‌లోకి తోసేస్తాం. అయితే, కొన్ని సార్లు ఫ్రిడ్జ్‌లోంచి దుర్వాసన వస్తుంది.

Source:Twitter

కొన్ని టిప్స్‌ పాటిస్తే ఫ్రిడ్జ్‌ నుంచి దుర్వాసన రాకుండా జాగ్రత్త పడొచ్చు.

Source:Twitter

సన్నని రంధ్రాలున్న చిన్న డబ్బాలో బేకింగ్ సోడాని నింపి ఫ్రిడ్జ్‌లో ఒక మూలలో పెడితే దుర్వాసన రాదు.

Source:Pixabay

చాలా రోజులుగా నిల్వ ఉన్న పదార్థాలను ఫ్రిజ్‌లోంచి తీసేయాలి. వాటిని అలానే ఉంచితే వేరేవి కూడా పాడవుతాయి.

Source:Twitter 

రెండు నిమ్మకాయ ముక్కలను ఫ్రిజ్‌లో ఉంచితే చెడు వాసనను అరికడతాయి.

Source:Pixabay

కాఫీ గింజలను ఓ గిన్నెలో తీసుకొని ఫ్రిజ్‌లో ఉంచితే చెడు వాసన పోయి కాఫీ వాసన వస్తుంది.

Source:Pixabay

ఆకుకూరలను కడిగి పూర్తిగా ఆరిన తర్వాత ఫ్రిజ్‌లో పెట్టాలి. తడితడిగా ఉన్నపుడు పెడితే త్వరగా కుళ్లిపోతాయి.

Source:Pixabay

వారానికి ఒకసారి వెనిగర్, నిమ్మరసం కలిపిన నీటితో ఫ్రిజ్ లోపల, బయట శుభ్రమైన క్లాత్‌తో తుడవాలి.

Source:Twitter

 ప్రతి అరను విడివిడిగా కడగాలి. కూరగాయలు ఉంచే ట్రేను ఎప్పటికప్పుడు శుభ్రంగా కడగాలి. అలా చేయకపోతే అవి కుళ్లిపోతాయి.

Source:Twitter 

ఫ్రిజ్‌లో ఆహారపదార్థాల మధ్య ఖాళీ ఉండేలా చూసుకోవాలి.

Source:Twitter

బుల్లి దేశం తువాలు విశేషాలెన్నో..

గూగుల్‌ డూడుల్‌ గమనించారా..!

సెక్సువల్‌ అసాల్ట్‌ అవేర్‌నెస్‌ మంత్‌

Eenadu.net Home