వేసవి కాలం.. ఇలా విద్యుత్‌ ఆదా చేయండి!

ఎండాకాలంలో ఏసీలు ఎక్కువగా వాడుతుంటారు. ఉష్ణోగ్రత మరీ 16-18 డిగ్రీల్లో కాకుండా 22 - 24 డిగ్రీలు పెట్టుకుంటే విద్యుత్‌ ఆదా అవుతుంది. 4.5, 5 స్టార్‌ రేటింగ్‌ ఉన్న ఏసీలు తీసుకుంటే మంచిది. 

Image: Pixabay

ఇంటి చుట్టూ మొక్కలు నాటండి. ఎండ ఇంట్లో పడకుండా కర్టన్లు ఏర్పాటు చేయండి. దీంతో ఇంట్లో వాతావరణాన్ని చల్లబర్చడానికి ఏసీ ఎక్కువగా శ్రమించాల్సిన అవసరం ఉండదు. విద్యుత్‌ వినియోగం తగ్గుతుంది. 

Image: Pixabay

సంప్రదాయ బల్బులతో పోలిస్తే.. సీఎఫ్‌ఎల్‌, ఎల్‌ఈడీ బల్బులు చాలా తక్కువ విద్యుత్‌ను ఉపయోగించుకుంటాయి. కాబట్టి.. ఎక్కువ వెలుతురును ఇచ్చే ఈ బల్బులు వాడండి. 

Image: Pixabay

మైక్రోవేవ్‌ ఓవెన్‌లో ఏదైనా వండుతున్నప్పుడు.. నిర్ధిష్ట సమయం కంటే కాస్త ముందుగానే ఆఫ్ చేయండి. ఎందుకంటే ఓవెన్‌ ఆఫ్ చేసినా.. కొంత సమయం వరకు వేడిగానే ఉంటుంది. వంట పూర్తవడానికి ఆ సమయం సరిపోతుంది. విద్యుత్‌ ఆదా అవుతుంది.

Image: Unsplash

ఇంట్లో ఫ్యాన్‌, లైట్లు వేసి అలాగే ఉంచేస్తుంటారు. వాటిని వినియోగించనప్పుడు కచ్చితంగా ఆఫ్‌ చేయడం అలవాటు చేసుకోవాలి. ఇది విద్యుత్‌ ఛార్జీలనే కాదు.. భూతాపాన్ని తగ్గిస్తుంది. 

Image: Unsplash

వేసవిలో ఫ్రిజ్‌ను మరింత ఎక్కువ ఉపయోగిస్తుంటాం. దీన్ని ఎండ తగిలేలా పెట్టినా, వాటర్‌ బాటిళ్లు, ఇతర ఆహారపదార్థాలతో నింపేసినా విద్యుత్‌ వినియోగం పెరుగుతుంది. ఫ్రిజ్‌లో కాస్త ఖాళీ ఉండేలా, వెంటిలేషన్‌ బాగుండేలా చూసుకోవాలి.

Image: Unsplash

వాషింగ్‌మిషన్‌లో దుస్తులు సగం వేసినా.. గరిష్ఠంగా వేసినా విద్యుత్‌ ఒకేలా ఛార్జ్‌ అవుతుంది. కాబట్టి.. తక్కువ దుస్తులు ఉన్నప్పుడు రెండ్రోలకోసారి దుస్తులు ఉతికితే విద్యుత్‌ ఆదా అవుతుంది. 

Image: Unsplash

ఎండాకాలంలో ఉతికి ఆరేసిన దుస్తులు చాలా తొందరగా ఆరిపోతాయి. కాబట్టి.. వాషింగ్‌మిషిన్‌లో డ్రై ఆప్షన్‌ను సెలెక్ట్‌ చేయకుండా దుస్తులను ఎండలో ఆరబెట్టండి.

Image: Unsplash

ప్రస్తుతం అన్ని గృహోపకరణాలు విద్యుత్‌ను ఆదా చేసేవిధంగా తయారుచేస్తున్నారు. కాబట్టి.. ఈసారి కొత్త వస్తువు కొనుగోలు చేస్తున్నప్పుడు ఎక్కువ విద్యుత్‌ ఆదా చేసే వాటినే ఎంచుకోండి.

Image: Unsplash

వైద్యరంగంలో స్థిరపడాలంటే డాక్టరే అవ్వాలా?

విదేశాల్లో చదవాలంటే.. ఈ పరీక్షలు రాయాల్సిందే!

పర్యావరణ హితం రంగుల హోలీ!

Eenadu.net Home