మొబైల్‌ డేటా ఆదా చేయడమెలా?

ప్రముఖ టెలికాం సంస్థలు రీఛార్జ్‌ ప్లాన్‌ ధరల్ని భారీగా పెంచాయి. ప్లాన్‌తో వచ్చే డేటాను విచ్చలవిడిగా వాడిస్తే.. డేటా ప్యాక్‌ కోసం మరింత ఖర్చు చేయాల్సి ఉంటుంది. అలా జరగకూడదంటే.. డేటాను ఇలా పొదుపు చేయండి.. 

రీఛార్జ్‌ చేసుకునే సమయంలోనే మీ డేటా అవసరాలను బట్టి ప్లాన్‌ను ఎంచుకోవాలి. ధర తక్కువ ఉండే ప్లాన్‌ ఎంచుకొని ఆ తర్వాత డేటా ప్యాక్‌లు కొంటే అదనపు వ్యయం అవుతుంది.

ప్లేస్టోర్‌లో యాప్స్‌ ఆటో అప్‌డేట్స్‌ను డిసెబుల్‌/ఓన్లీ వైఫైలో ఉంచాలి. లేదంటే యాప్స్‌ మొబైల్‌ డేటాను వినియోగించుకొని అప్‌డేట్‌ అవుతాయి. అవసరమైన సమయంలో డేటా కొరత ఏర్పడొచ్చు.

ఎక్కడైనా వైఫై సదుపాయం ఉంటే.. దాన్ని కనెక్ట్‌ చేసుకోవడం మంచిది. ఫలితంగా మొబైల్‌ డేటా ఆదా అవుతుంది. ఏవైనా అప్‌డేట్స్‌, డౌన్‌లోడ్స్‌ ఉంటే వైఫైలో చేసుకుంటే సరి. అయితే, వైఫై సురక్షితమో కాదో చెక్‌ చేసుకోవాలి.

అనవసరమైన యాప్స్‌ అన్‌ఇన్‌స్టాల్‌ చేయాలి. తాత్కాలిక అవసరాల కోసం ఇన్‌స్టాల్‌ చేసుకున్న యాప్స్‌లో బ్యాక్‌గ్రౌండ్‌ డేటా యూసెజ్‌ను రిస్ట్రిక్ట్‌ చేయాలి. దీంతో ఆ యాప్స్‌ బ్యాక్‌గ్రౌండ్‌లో డేటా వినియోగించడం ఆగిపోతుంది. 

హైక్వాలిటీ ఫొటోలు, వీడియోలకు ఎక్కువ డేటా ఖర్చవుతుంది. ఆన్‌లైన్‌ స్ట్రీమింగ్‌ అయినా, డౌన్‌లోడ్‌ అయినా క్వాలిటీని ఆటోమోడ్‌లో కాకుండా తక్కువ క్వాలిటీలో పెట్టుకుంటే డేటాను ఆదా చేయొచ్చు.

కొన్ని బ్రౌజర్లు, యాప్స్‌ డేటా సేవింగ్‌ ఫీచర్‌ని కలిగి ఉంటాయి. దాన్ని యాక్టివేట్‌ చేసుకుంటే బ్రౌజింగ్‌లో వెబ్‌పేజీలు, ఇమేజ్‌, వీడియో సైజును కంప్రెస్‌ చేసి చూపిస్తుంది. ఎక్కువ డేటా ఖర్చవదు. 

యాప్స్‌ అడిగే పర్మిషన్స్‌లో అవసరం లేనివి రిజెక్ట్‌ చేయండి. పుష్‌నోటిఫికేషన్స్‌ కూడా ఆఫ్ చేసుకుంటే యాప్స్‌ డేటా యూసేజ్‌ తగ్గుతుంది. ఈ మేరకు సెట్టింగ్స్‌లోని యాప్స్‌ సెక్షన్‌లో మార్పులు చేసుకోవాలి.

ఎప్పటికప్పుడు మీ డేటా వినియోగాన్ని సమీక్షించుకోవాలి. ఏ యాప్‌కి ఎంత డేటా ఖర్చవుతుందో తెలుసుకోవాలి. వాటిని ఆప్టిమైజ్‌ చేసుకోవడం ద్వారా డేటాను ఆదా చేయొచ్చు.

పిల్లలు విసిగిస్తున్నారని ఫోన్ ఇస్తున్నారా..?

అలాంటి పోస్టులు చేస్తే కఠిన చర్యలు తప్పవు!

ఎయిర్‌టెల్‌ ఓటీటీ ప్లాన్లు ఇవే..

Eenadu.net Home