ఉద్యోగాన్వేషణ? ఇలా సిద్ధమవ్వండి!
మొదట మీరు ఎలాంటి ఉద్యోగం చేయాలనుకుంటున్నారో నిర్ణయించుకోవాలి. మీరు ఎంచుకున్న ఉద్యోగం మీ లక్ష్యాలను నెరవేర్చేదేనా కాదా సమీక్షించుకోవాలి.
Image: Pixabay
మీరు దరఖాస్తు చేసుకునే ఉద్యోగానికి తగినట్లు కరిక్యులమ్ విటేను సమగ్రంగా రూపొందించుకోవాలి. మీ విద్యార్హతలతోపాటు మీకున్న నైపుణ్యాలను అందులో పేర్కొనాలి. అనవసర విషయాలను ప్రస్తావించొద్దు.
Image: Pixabay
ఒకేసారి వివిధ పోస్టులకు దరఖాస్తు చేస్తే ఆయా పోస్టులకు అనుగుణంగా కరిక్యులమ్ విటేలో మార్పులు చేయాలి. అన్నిటికీ ఒకటే పెట్టడం సరికాదు.
Image: Pixabay
మీకు నచ్చిన కంపెనీల్లోనే పనిచేయాలనుకుంటే.. తరచూ ఆయా కంపెనీల వెబ్‌సైట్స్‌లో కెరీర్ సెక్షన్‌ను గమనిస్తుండండి. నియామక ప్రకటనలు వెలువడినప్పుడు దరఖాస్తు చేసుకునే వీలుంటుంది.
Image: Pixabay
ఇప్పటికే మీకు ఇమెయిల్ అకౌంట్ ఉండి ఉండొచ్చు. కానీ, ఉద్యోగాన్వేషణలో ప్రత్యేకంగా మరో ఇమెయిల్ అకౌంట్‌ను క్రియేట్ చేసుకోండి. దాన్నే అన్ని దరఖాస్తుల్లో ఉపయోగించండి.
Image: Pixabay
ఉద్యోగ అవకాశాల గురించి తెలిపే వెబ్‌సైట్లు చాలా ఉన్నాయి. వాటిలో మీ వివరాలు నమోదు చేసి, నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. మీకు తగిన ఉద్యోగ అవకాశం వచ్చినప్పుడు అవి మిమ్మల్ని అలర్ట్ చేస్తాయి.
Image: Pixabay
స్నేహితులు, బంధువులు, వివిధ కంపెనీల్లో పరిచయమున్న ఉద్యోగులతో మీ ఉద్యోగాన్వేషణ గురించి చెప్పండి. వారికి తెలిసిన కంపెనీల్లో నియామకాలు ఉన్నప్పుడు మిమ్మల్ని రిఫర్ చేసే అవకాశముంది.
Image: Pixabay
కొన్ని కంపెనీలు అభ్యర్థుల సోషల్‌మీడియాను పరిశీలిస్తుంటాయి. కాబట్టి.. మీ సోషల్‌మీడియా అకౌంట్స్‌లో అనవసర, వివాదాస్పద పోస్టులు పెట్టకపోవడం మంచిది.
Image: Pixabay
వీటితోపాటు ఇంటర్వ్యూను ఎలాంటి బెరుకు లేకుండా ఎదుర్కొనేలా సిద్ధమవ్వాలి.
Image: Pixabay