హిట్ కాన్సెప్ట్.. బాలీవుడ్ హీరో.. టాలీవుడ్ హీరోయిన్
#eenadu
తెలుగులో వరుస సినిమాలతో బిజీగా ఉన్న శ్రీలీల.. కార్తిక్ ఆర్యన్ సరసన ‘తు మేరీ మే తేరా’తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనుంది.
‘అమరన్’తో ఇటీవలే హిట్ అందుకున్న సాయి పల్లవి.. రణ్‌బీర్ కపూర్ సరసన ‘రామాయణ’తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టనుంది.
ఇక సంయుక్త ‘మహారాజ్ఞి: క్వీన్ ఆఫ్ క్వీన్స్’ చిత్రంతో ఈ ఏడాదే బాలీవుడ్‌లో అడుగుపెట్టబోతోంది.
2022లో ‘గుడ్ బై’తో బాలీవుడ్‌కు హలో చెప్పిన రష్మిక.. హిందీలో ‘ఛావా’, ‘సికందర్’, ‘థామా’లో నటిస్తోంది.
2014లోనే ‘యారియాన్’తో బాలీవుడ్‌లో డెబ్యూ ఇచ్చిన రకుల్ ప్రీత్‌సింగ్.. ప్రస్తుతం ‘మేరే హస్బెండ్ కి బీవీ’, ‘దే దే ప్యార్ దే 2’లో నటిస్తోంది.
‘మద్రాస్ కేఫ్’తో 2013లో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన రాశీ ఖన్నా.. గతేడాది ‘యోధ’తో అలరించింది. ప్రస్తుతం విక్రాంత్ మస్సే సరసన ఓ సినిమాలో నటిస్తోంది.
2012లో ‘ఏక్ దీవానా థా’లో అతిథి పాత్రలో మెరిసిన సమంత.. ‘ద ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2’, ‘సిటడెల్: హన్నీ బన్నీ’ వెబ్‌సిరీస్‌లో నటించింది. ప్రస్తుతం ‘రక్త్ బ్రాహ్మండ్: ద బ్లడీ కింగ్‌డమ్’ సిరీస్‌లో నటిస్తోంది.
మాళవిక మోహనన్ గతేడాది ‘యుద్ర’తో హిందీలో అడుగుపెట్టింది.
కిందటి ఏడాది ‘బేబీజాన్’తో కీర్తి సురేశ్ హిందీ ప్రేక్షకులను అలరించింది.
నయనతార 2023లో షారుక్ ఖాన్ ‘జవాన్’తో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది.
‘రామన్ రాఘవన్ 2.0’తో బాలీవుడ్‌తోనే పరిశ్రమలోకి అడుగుపెట్టిన శోభితా ధూళిపాళ కిందటి ఏడాది ‘లవ్, సితార’తో అలరించింది.