వ్యాపారవేత్తలుగా టాలీవుడ్ సినీతారలు!
సమంత
టాలీవుడ్‌లో స్టార్‌హీరోయిన్‌గా కొనసాగుతోన్న సమంత.. ఇప్పటికే ‘సాకీ’ పేరుతో ఫ్యాషన్ దుస్తుల వ్యాపారం చేస్తోంది. గతేడాది ‘సస్టైన్‌కార్ట్’ అనే ఆన్‌లైన్ స్టోర్‌లో.. తాజాగా‘నరిష్ యూ’అనే కంపెనీలో సమంత పెట్టుబడులు పెట్టింది.
Image: Instagram
రకుల్‌ప్రీత్ సింగ్
కూల్ బ్యూటీ రకుల్ పోషకాలతో కూడిన ఆహారం అందించే ‘వెల్‌బీయింగ్ న్యూట్రిషన్’ అనే కంపెనీలో పెట్టుబడి పెట్టింది. ఇప్పటికే ‘ఎఫ్ 45’ జిమ్‌లో పెట్టుబడి పెట్టి.. హైదరాబాద్ ఫ్రాంఛైజీని నిర్వహిస్తోంది.
Image: Instagram
కాజల్ అగర్వాల్
హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా పెట్టుబడిదారిగా మారింది. ‘టీ.ఎ.సీ(ది ఆయుర్వేద కంపెనీ)’లో పెట్టుబడి పెట్టింది. ఇప్పటికే సోదరి నిషా అగర్వాల్‌తో కలిసి కాజల్.. ‘మర్సలా’ పేరుతో జ్యువెలరీ స్టోర్ నిర్వహిస్తోంది.
Image: Instagram
రష్మిక మందనా
బ్యూటీకేర్ ప్రొడక్ట్స్ తయారు చేసే ‘ప్లమ్’ సంస్థలో నేషనల్ క్రష్ రష్మిక మందనా పెట్టుబడులు పెట్టింది. బ్రాండ్ అంబాసిడర్‌గానూ వ్యవహరిస్తోంది.
Image: Instagram
తమన్నా
టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ తమన్నా ఇప్పటికే వైట్ అండ్ గోల్డ్ పేరుతో ఆన్‌లైన్‌లో ఆభరణాల స్టోర్ నిర్వహిస్తోంది. ఇటీవల ప్రముఖ కాస్మోటిక్ సంస్థ ‘షుగర్’లో పెట్టుబడి పెట్టి భాగస్వామిగా మారింది.
Image: Instagram
ప్రణీత
నటి ప్రణీతకు బెంగళూరులో ‘బూట్‌లెగ్గర్’పేరుతో ఓ రెస్టారెంట్ ఉంది. ఆతిథ్య రంగంలోని ఓ కంపెనీలో ఈమెకు భాగస్వామ్యముంది.
Image: Instagram
తాప్సీ
తాప్సీ.. తన సోదరితో కలిసి ‘ది వెడ్డింగ్ ఫ్యాక్టరీ’పేరుతో ఈవెంట్ మెనేజ్‌మెంట్ సంస్థను నిర్వహిస్తోంది. అలాగే ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్‌లో పుణె ఫ్రాంఛైజీలో పెట్టుబడి పెట్టింది.
Image: Instagram
కీర్తి సురేశ్
చెన్నైకి చెందిన డిజిటల్ హోమ్-కుక్కింగ్ స్టార్టప్ సంస్థలో కీర్తి సురేశ్ పెట్టుబడి పెట్టింది. అలాగే, స్కిన్‌కేర్ ప్రొడక్ట్స్ ఉత్పత్తి చేసే ‘భూమిత్ర’లోనూ భాగస్వామిగా మారింది.
Image: Instagram
నయనతార
లేడీ సూపర్‌స్టార్ నయనతార ఫుడ్ కంపెనీ ‘ఛాయ్ వాలే’, కాస్మొటిక్ కంపెనీ ‘ది లిప్ బామ్’లో ఇప్పటికే పెట్టబడులు పెట్టింది. ‘రౌడీ పిక్చర్స్’బ్యానర్‌తో సినిమాలు నిర్మిస్తోంది. ప్రస్తుతం దుబాయ్‌లోని ఓ ఇంధన తయారీ సంస్థలో పెట్టుబడులు పెడుతున్నట్లు సమాచారం.
Image: Instagram
శ్రుతి హాసన్
‘ఇసిడ్రో’ పేరుతో సొంత ప్రొడక్షన్ కంపెనీ ప్రారంభించింది. దీని ద్వారా షార్ట్‌ఫిల్మ్స్, మ్యూజిక్, మల్టీమీడియా కంటెంట్‌ను రూపొందిస్తోంది.
Image: Instagram