‘లైగర్‌’ కంటే ముందు రింగులోకి దిగిన హీరోలెవరో తెలుసా?

పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ నటించిన పాన్‌ ఇండియా చిత్రం ‘లైగర్‌’. ఇందులో విజయ్‌ మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ ఫైటర్‌గా కనిపించాడు. గతంలో పలువురు హీరోలు కూడా రింగులోకి దిగారు. వారెవరంటే..

Image: Social media

పవన్‌ కల్యాణ్‌


‘తమ్ముడు’లో పవన్‌ కల్యాణ్‌ బాక్సర్‌గా నటించారు. అన్న లక్ష్యాన్ని నెరవేర్చడం కోసం బాక్సింగ్‌ నేర్చుకునే కుర్రాడి పాత్ర అది. 1999లో విడుదలైన ఈ చిత్రం మంచి హిట్‌ సాధించింది.

Image: Social media

ఆ తర్వాత 2003లో స్వీయదర్శకత్వంలో వచ్చిన ‘జానీ’లో పవన్‌ ‘మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌’ ఫైటర్‌గా కనిపించారు. కానీ, ఆ చిత్రం ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయింది.

Image: Social media

రవితేజ


రవితేజ.. పూరీ జగన్నాథ్‌ క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన హ్యాట్రిక్‌ మూవీ.. ‘అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి’. 2003లో విడుదలై బ్లాక్‌బాస్టర్‌ హిట్‌ అందుకుంది.

Image: Social media

నవదీప్‌


ఓ కాలేజీ కుర్రాడు దేశం కోసం బాక్సింగ్‌ నేర్చుకొని పాకిస్థాన్‌ బాక్సర్‌పై విజయం సాధిస్తాడు. అదే ‘జై’ సినిమా కథ. దర్శకుడు తేజ తెరకెక్కించిన ఈ చిత్రంతోనే హీరో నవదీప్‌ వెండితెరకు పరిచయమయ్యాడు. 2004లో విడుదలైన ఈ చిత్రం సూపర్‌ హిట్‌గా నిలిచింది.

Image: Social media

విక్రమ్‌


విక్రమ్‌, శ్రీవిద్య జంటగా నటించిన ‘మనసారా’ భారతీయ మార్షల్‌ ఆర్ట్స్‌ ‘కళరిపయట్టు’ నేపథ్యంలో తెరకెక్కింది. ఇది కేరళలో అతి ప్రాచీనమైన యుద్ధ కళ. 2010లో వచ్చిన ఈ చిత్రానికి దర్శకుడు రవిబాబు.

Image: Social media

నారా రోహిత్‌


నారా రోహిత్‌ నటించిన ‘తుంటరి’ కూడా బాక్సింగ్‌ నేపథ్యంలో వచ్చిందే. ఆవారాగా తిరిగే హీరో బాక్సర్‌గా ఎందుకు మారాడనేది కథ. లతా హెగ్డే హీరోయిన్‌. 2016లో విడుదలైన ఈ చిత్రానికి కుమార్‌ నాగేంద్ర దర్శకుడు.

Image: Social media

వెంకటేశ్‌


దర్శకురాలు సుధ కొంగర 2017లో తెరకెక్కించిన ‘గురు’ చిత్రంలో విక్టరీ వెంకటేశ్‌ రింగులోకి దిగకపోయినా బాక్సింగ్‌ కోచ్‌గా కనిపిస్తారు. ఓ కూరగాయలు అమ్మే యువతిని ఏ విధంగా బాక్సర్‌గా తీర్చిదిద్దారనేదే ఈ సినిమా కథ.

Image: Social media

వరుణ్‌ తేజ్‌


ఇటీవల విడుదలైన ‘గని’లో వరుణ్‌ తేజ్‌ బాక్సర్‌గా కనిపించాడు. కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది. ఇందులో సాయీ మంజ్రేకర్‌ కథానాయిక. సునీల్‌ శెట్టి, ఉపేంద్ర, నవీన్‌చంద్ర కీలక పాత్రలు పోషించారు.

Image: Social media

విజయ్‌ సాహిబా రాధికనే!

లుక్కు మార్చి.. అంచనాలు పెంచి!

ఐస్‌క్రీమ్‌.. అర్జిత్‌ సింగ్‌ మ్యూజిక్‌.. ఆల్‌టైమ్‌ ఫేవరెట్స్‌

Eenadu.net Home