అత్తగా అదరగొట్టిన నటీమణులు..

వెండితెరపై గయ్యాళి అత్త పాత్రలకు చిరునామా సూర్యకాంతం.. సినిమాలో ‘అత్తరికాన్ని’ చెలాయించి ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారామె. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో అత్త పాత్రల్లో అలరించిన నటీమణులు గురించి తెలుసుకుందామా..

రూపా లక్ష్మి 

పలు సినిమా, సీరియళ్లలో నటించిన రూపా లక్ష్మి..‘బలగం’ లో హీరో మేనత్తగా కనిపించారు. తన సహజ నటనతో గుండెల్ని మెలిపెట్టే ‘లచ్చవ్వ’ పాత్ర పోషించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.‘జాంబీ రెడ్డి’, ‘సరిలేరు నీకెవ్వరు’, ‘మహర్షి’ వంటి చిత్రాల్లోనూ నటించారు.

నదియా 

ఎక్కువగా తమిళ, మలయాళ సినిమాల్లో నాయికగా నటించారు. ‘అత్తారింటికి దారేది’ లో పవన్‌ కల్యాణ్ మేనత్త పాత్రతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ‘అ.. ఆ..’, ‘మిస్‌ ఇండియా’, ‘వరుడు కావలెను’లోనూ అత్తగా నటించారు.

రమ్యకృష్ణ 

అందమైన నాయికగా రమ్యకృష్ణ ఎన్నో చిత్రాల్లో నటించారు. ‘నా అల్లుడు’, ‘శైలజారెడ్డి అల్లుడు’లో అత్త పాత్రను రక్తి కట్టించారు.

అనసూయ 

జబర్దస్త్‌ యాంకర్‌ అనసూయ ‘రంగస్థలం’లో రంగమ్మత్త పాత్రలో అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

తులసి

బాలనటిగా, కథానాయికగా పలు సినిమాల్లో నటించారు తులసి. ‘నేను లోకల్ ’ ‘శ్రీమంతుడు’, ‘ఇద్దరమ్మాయిలతో’, ‘స్కైలాబ్ ’, ‘నా గర్ల్‌ ఫ్రెండ్ బాగా రిచ్‌’ వంటి పలు చిత్రాల్లో అత్త పాత్రల్లో అలరించారు.

ప్రగతి 

‘ఏమైంది ఈ వేళ’ లో హీరో తల్లి పాత్రకు ఉత్తమ సహాయ నటిగా నంది పురస్కారం అందుకున్నారు. ‘ఎఫ్ 2’, ‘ఎఫ్3’ చిత్రాల్లో అత్తగా తనదైన ముద్ర వేశారు. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌’, ‘ఓయ్‌ నిన్నే’, ‘బెంగాల్ టైగర్‌’లలో అత్త పాత్రలు చేశారు.

సంగీత 

పలు సినిమాల్లో హీరోయిన్ గా మెప్పించిన సంగీత ‘సరిలేరు నీకెవ్వరూ’లో హీరో అత్తగా అద్భుతంగా నటించి ప్రశంసలు పొందారు.

రాజేశ్వరి నాయర్‌

బుల్లితెరపై పలు సీరియల్స్‌లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న రాజేశ్వరి నాయర్ వెండితెరపైనా అలరిస్తున్నారు. ‘షాదీ ముబారక్‌’, ‘ధమాకా’, ‘మజిలీ’, ‘నిన్ను కోరి’, ‘అమిగోస్‌’, ‘ఎంత మంచివాడవురా’ వంటి చిత్రాల్లో అత్తగా నటించారు.

పవిత్ర లోకేష్‌

‘కల్యాణం కమనీయం’,‘ఆరెంజ్‌’, ‘తేజ్ ఐ లవ్ యూ’, ‘చిత్రలహరి’, ‘లోఫర్‌’, ‘ ఫిట్టింగ్ మాస్టర్’,‘ శక్తి’, ‘ మిస్టర్ మజ్ను’ వంటి చిత్రాల్లో అత్త పాత్రలు పోషించారు.

రోజా 

పలు సినిమాల్లో హీరోయిన్‌ గా అలరించిన రోజా ‘మొగుడు’, ‘గోలిమార్‌’ లలో అత్తగా మెరిశారు.

సెలబ్రిటీ లుక్‌: మంజ్రేకర్‌ కొత్త హెయిర్‌స్టైల్‌.. అనన్య స్మైల్‌

చీర రూటే సపరేటు

సోషల్‌లుక్‌: ముగ్ధ మనోహరాలు.. మైమరపించే అందాలు..

Eenadu.net Home