జోరు మీదున్న సీనియర్‌ హీరోయిన్లు!

టాలీవుడ్‌లో కొందరు సీనియర్‌ హీరోయిన్లు మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు. ఇటీవల వారు నటించిన సినిమాలు హిట్‌ కొట్టాయి. నటిస్తోన్న చిత్రాలూ చాలానే ఉన్నాయి. ప్రస్తుతం షూటింగ్స్‌తో బిజీగా ఉన్న ఆ తారలెవరో చూద్దామా....

Image: Instagram

కాజల్‌

స్టార్‌ హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ మళ్లీ రీఎంట్రీ ఇస్తోంది. ఇప్పటికే ‘ఇండియన్‌ 2’ షూటింగ్‌లో పాల్గొంటున్న కాజల్‌.. బాలకృష్ణ 108 చిత్రంతోపాటు మరో రెండు చిత్రాల్లో నటిస్తోంది. ఇది వరకు ఈమె నటించిన ‘కోస్టీ’ తాజాగా విడుదలైంది. 

Image: Instagram

త్రిష

మణిరత్నం ‘పీఎస్‌ 1’లో నటించిన త్రిష.. మళ్లీ ఫామ్‌లోకి వచ్చేసింది. ప్రస్తుతం పీఎస్‌2తోపాటు, విజయ్‌ ‘లియో’, ‘రామ్‌’, ‘ది రోడ్‌’, ‘సతురంగ విట్టై’ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఓ వెబ్‌సిరీస్‌లోనూ కనిపించనుంది.  

Image: Instagram

తమన్నా

మిల్కీ బ్యూటీ తమన్నా.. ప్రస్తుతం చిరంజీవి ‘భోళా శంకర్‌’లో నటిస్తోంది. ‘జైలర్‌’లో రజనీకాంత్‌తో నటించే అవకాశం దక్కించుకుంది. ‘బాంద్ర’, ‘ఆరన్మయి’, ‘భోలే చుడియాన్‌’ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. 

Image: Instagram

శ్రియ

‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో మంచి పాత్ర పోషించిన శ్రియ.. ‘దృశ్యం 2(హిందీ)’తో మళ్లీ విజయం అందుకుంది. ఇటీవల ‘కబ్జ’లో నటించిన ఈ సీనియర్‌ హీరోయిన్‌.. ఇప్పుడు ‘మ్యూజిక్‌ స్కూల్‌’లో నటిస్తోంది.  

Image: Instagram

ప్రియమణి

ప్రస్తుతం సహాయక పాత్రలతో అలరిస్తోంది నటి ప్రియమణి. ఈ మధ్య ‘విరాట పర్వం’, ‘సలాం వెంకీ’, ‘డాక్టర్‌. 56’లో కనిపించిన ప్రియమణి.. ‘కొటేషన్‌ గ్యాంగ్‌’, ‘ఖైమార’, ‘కస్టడీ’, ‘మైదాన్‌’, ‘జవాన్‌’లో నటిస్తోంది.  

Image: Instagram

అనుష్క

చాలాకాలం తర్వాత మరోసారి వెండితెరపై కనిపించేందుకు సిద్ధమైంది నటి అనుష్క. నవీన్‌ పొలిశెట్టితో కలిసి ‘మిస్‌ శెట్టి.. మిస్టర్‌ పొలిశెట్టి’లో కథానాయికగా నటిస్తోంది. ఇందులో చెఫ్‌ పాత్రలో కనిపించనుంది. 

Image: Instagram

నయనతార

హీరోలకు జోడీగా నటిస్తూనే.. మహిళా ప్రాధాన్యమున్న చిత్రాలు చేస్తూ నాయనతార చాలా బిజీగా ఉంది. ప్రస్తుతం ఈమె.. అట్లీ తెరకెక్కిస్తోన్న‘జవాన్‌’లో షారుక్‌ఖాన్‌తో కలిసి నటిస్తోంది. ‘ఐరవన్‌’తోపాటు మరో రెండు చిత్రాల్లోనూ మెరవనుంది.  

Image: Instagram

శ్రుతి హాసన్‌

ఇటీవల అగ్ర హీరోలతో (చిరంజీవి - వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ - వీరసింహారెడ్డి) కలిసి నటించి హిట్‌ కొట్టిన శ్రుతి హాసన్‌.. ప్రస్తుతం ‘సలార్‌’లో ప్రభాస్‌కు జోడీగా నటిస్తోంది. ‘ది ఐ’ అనే ఇంగ్లీష్‌ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తోంది. 

Image: Instagram

హన్సిక

‘దేశ ముదురు’ హీరోయిన్‌ హన్సిక ఇటీవల వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. అయినా చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. ‘పార్ట్‌నర్‌’, ‘105 మినిట్స్‌’, ‘మై నేమ్‌ ఈజ్‌ శ్రుతి’, ‘రౌడీ బేబీ’, ‘గార్డియన్‌’, ‘గాంధారి’, ‘మ్యాన్‌’ చిత్రాల్లో నటిస్తోంది. 

Image: Instagram

అంజలి

ఇటీవల రెండు వెబ్‌సిరీస్‌లు(ఝాన్సీ, ఫాల్‌)తో ప్రేక్షకులను పలకరించింది.. సీనియర్‌ హీరోయిన్‌ అంజలి. ప్రస్తుతం రామ్‌ చరణ్‌, శంకర్‌ కాంబో ‘ఆర్‌సీ -15’లో ముఖ్య భూమిక పోషిస్తోంది. ‘బహిష్కరణ’ అనే మరో వెబ్‌సిరీస్‌లోనూ నటిస్తోంది.  

Image: Instagram

చిరుతో స్టెప్పులేయడం నా అదృష్టం!

‘తెర’ పంచుకున్న హీరోయిన్లు..

సూట్‌.. అదిరేలా ఫొటోషూట్‌!

Eenadu.net Home