టమాటా లేకపోతేనేం.. ఇవి ఉన్నాయిగా..

పెరిగిన టమాటా ధరలతో సామాన్యుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఏ కూర వండినా అందులోకి టమాటా ఉండాల్సిందే. కానీ దీని ధర కొండెక్కి కూర్చుంది. దీనికి ప్రత్యామ్నాయంగా ఏం వాడుకోవచ్చో చూద్దాం రండి..

image: unsplash

ఏదైనా కూరలో టమాటాని పులుపు కోసమే వాడితే దానికి బదులుగా చింతపండునో, నిమ్మకాయనో వాడొచ్చు. చింతపులుసు వేస్తే కూరలో గ్రేవీ కూడా ఉంటుంది.

image: rkc

ఉసిరికాయ పొడి, ఆమ్‌చూర్‌ పొడి కూడా కూరకి పులుపుతో పాటు రుచిని అందిస్తాయి. వీటిలో పోషకాలు కూడా మెండుగా ఉంటాయి.

image: unsplash

కొద్దిగా నూనెలో ఉల్లిపాయ ముక్కల్ని ఫ్రై చేసి నేరుగా లేదా పేస్టుగా చేసి ఉపయోగిస్తే కూరకి రుచి, చిక్కదనం వస్తుంది. కానీ ఇవి మరీ ఎక్కువైతే కూర ఘాటుగా ఉంటుంది.

image: unsplash

టమాటాకి బదులుగా రసం, సాంబార్‌లో పచ్చిమామిడికాయని ఉపయోగించి చూడండి. రుచి చాలా బాగుంటుంది.

image: unsplash

స్నాక్స్‌, సలాడ్స్‌లో టమాటాని ఎక్కువగా ఉపయోగిస్తాం. దాని బదులుగా ఆ రుచి ఏ మాత్రం మారకూడదు అంటే టమాటా కెచెప్‌ లేదా సాస్‌ని ఉపయోగించొచ్చు.

image: unsplash

పెరుగు.. ఇది రుచిలో టమాటా లాగా పుల్లగా, కొద్దిగా తియ్యగానూ ఉంటుంది. అలాగే గ్రేవీ కూడా చిక్కబడుతుంది. కాబట్టి పెరుగుని బిర్యానీ, మాంసం కూరల్లో ఉపయోగిస్తే కూరలకు కమ్మటి రుచి వస్తుంది.

image: unsplash

టమాటా లేకుండా కూర వండాలంటే గుమ్మడికాయ మంచి ఎంపిక. దీని రుచి కొంచెం తియ్యగా ఉంటుంది. టమాటా లేని లోటును ఇది తీరుస్తుంది.

image: unsplash

సొరకాయకు కొద్దిగా చింతపండు జోడించి మిక్సీ పట్టి దాన్ని కూరల్లో కలుపుకోవచ్చు. ఇది కూరని చిక్కగా చేయటమే కాకుండా గ్రేవీకి మంచి రుచినిస్తుంది.

image: rkc

వర్షాకాలంలో రోడ్‌ ట్రిప్‌.. ఈ దారుల్లో అద్భుతం..

ఒత్తిడిని జయించేందుకు నిపుణుల సలహాలివే..!

ట్రావెల్‌ డిటెక్టివ్‌.. ఆన్వీ కామ్‌దార్‌

Eenadu.net Home