భారత ట్విటర్‌లో అత్యధిక ఫాలోవర్స్‌ ఉన్న టాప్‌- 10 సెలబ్రిటీలు!

 (జులై 13, 2002 నాటికి) 

1. ప్రధాని నరేంద్ర మోదీ


మోదీ 80.6 మిలియన్ల మంది ఫాలోవర్లలో తొలిస్థానంలో ఉన్నారు. ఆయన 2,435 మందిని ఫాలో అవుతున్నారు.

Source: Twitter

2. పీఎమ్‌వో ఇండియా


ప్రధాని కార్యాలయం ట్విటర్‌ ఖాతా రెండో స్థానంలో ఉంది. దీన్ని 49.3 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు.

Source: Twitter

3. విరాట్‌ కోహ్లీ


టీం ఇండియా మాజీ సారథి విరాట్‌ కోహ్లీని 48.9 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. విరాట్‌ 65 మందిని ఫాలో అవుతున్నాడు. 

Source: Twitter

4. అమితాబ్‌ బచ్చన్‌


బాలీవుడ్ మెగాస్టార్‌ అమితాబ్‌ 1,804 మందిని ఫాలో అవుతుండగా.. ఆయన ఖాతాను 47.6మిలియన్ల మంది అనుసరిస్తున్నారు.

Source: Twitter

5. అక్షయ్‌ కుమార్‌


ఈ బాలీవుడ్‌ స్టార్‌ హీరోనూ ట్విటర్‌లో 44.9మిలియన్ల మంది ఫాలో అవుతుండగా.. ఆయన 27 మందిని ఫాలో చేస్తున్నారు.

Source: Twitter

6. సల్మాన్‌ ఖాన్‌


బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ను 44.1మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. సల్లూ భాయ్‌ 28 మందిని అనుసరిస్తున్నారు.

Source: Twitter

7. షారుఖ్‌ ఖాన్‌


బాలీవుడ్‌ బాద్‌షాను ట్విటర్‌లో 42.5మిలియన్ల నెటిజన్లు ఫాలో అవుతుండగా, ఆయన 77 మందిని అనుసరిస్తున్నారు.

Source: Twitter

8. సచిన్‌


క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ను ట్విటర్‌లో 37.4 మిలియన్ల ట్విటర్‌ ఖాతాదారులు ఫాలో చేస్తుండగా.. సచిన్‌ 81 మందిని ఫాలో అవుతున్నారు.

Source: Twitter

9. హృతిక్ రోషన్‌


ఈ స్టార్‌ హీరోను 31.7మిలియన్ల మంది అనుసరిస్తున్నారు. ఆయన 89 మందిని ఫాలో అవుతున్నారు.

Source: Twitter

10. దీపికా పదుకొణె


దీపికాను 27.4మిలియన్ల నెటిజన్లు ఫాలో అవుతుండగా.. ఆమె 67 మందిని ఫాలో చేస్తున్నారు.

Source: Twitter

వీరిందరిలో అమితాబ్‌ ఎక్కువగా 69,300ట్వీట్లు చేయగా.. విరాట్‌ కోహ్లీ అత్యల్పంగా 2,641 ట్వీట్లు చేశాడు.

Source: Eenadu

హోలీ రంగులకు అర్థాలు తెలుసా?

వంట టేస్టీగా వచ్చేందుకు చెఫ్‌లు ఇస్తున్న టిప్స్‌..

నిల్వ పచ్చళ్లను అల్యూమినియం, స్టీలు పాత్రల్లో ఎందుకు పెట్టకూడదు!

Eenadu.net Home