టాప్‌ 10 క్లౌడ్‌ స్టోరేజ్‌ వెబ్‌సైట్స్‌

గూగుల్‌ డ్రైవ్‌

దీంట్లో 15జీబీ వరకు ఉచితంగా వినియోగించుకోవచ్చు. ఆ తర్వాత డబ్బులు పెట్టి వివిధ ప్లాన్స్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది.

#Eenadu

మెగా

ఇందులో 20 జీబీ వరకు ఉచితంగా వాడుకోవచ్చు. అంతకు మించి స్టోరేజ్‌ కావాలంటే.. ప్యాకేజీ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. 

#Eenadu

పీక్లౌడ్‌

సైనప్‌ అయితే 10 జీబీ స్టోరేజ్‌ ఉచితంగా అందిస్తారు. ఎక్కువ వాడాలంటే.. ఏడాదికి లేదా ఏకమొత్తంలో చెల్లించి 500 జీబీ, 2 టీబీ, 10 టీబీ స్టోరేజ్‌ పొందొచ్చు.

#Eenadu

మీడియా ఫైర్‌

దీంట్లో 10 జీబీ వరకు, స్నేహితులకు రిఫర్‌ చేస్తే 50 జీబీ వరకు స్టోరేజ్‌ను ఉచితంగా పొందొచ్చు. నెలవారీ ఛార్జీలతో 1 టీబీ, 2 టీబీ ప్యాకేజ్‌లూ ఉన్నాయి.

#Eenadu

డ్రాప్‌బాక్స్‌

దీంట్లో కేవలం 2జీబీ స్టోరేజ్‌ మాత్రమే ఫ్రీగా లభిస్తుంది. అయితే, కొన్ని టాస్క్‌లు చేస్తూ ఉచిత స్టోరేజ్‌ను 18జీబీ వరకు పెంచుకోవచ్చు. 5టీబీ నెలవారీ, ఏడాది ప్యాకేజ్‌లున్నాయి. 

#Eenadu

వన్‌డ్రైవ్‌

మైక్రోసాఫ్ట్‌కు చెందిన ఈ స్టోరేజ్‌ ప్లాట్‌ఫాంలో కేవలం 5జీబీ మాత్రమే ఉచితం. ఆ తర్వాత వ్యక్తిగత స్టోరేజ్‌లకు, వ్యాపార అవసరాలకు విడివిడిగా ప్యాకేజ్‌లున్నాయి. 

#Eenadu

సింక్‌

దీంట్లో సైనప్‌ అయితే 5జీబీ స్టోరేజ్‌ ఉచితంగా లభిస్తుంది. వివిధ కేటగిరీలను బట్టి ఛార్జీలున్నాయి.

#Eenadu

టెరాబాక్స్‌

అత్యధికంగా 1టీబీ స్టోరేజ్‌ ఉచితంగా లభిస్తోంది. ఆ తర్వాత వివిధ ప్లాన్స్‌ను ఎంపిక చేసుకొని మరింత స్టోరేజ్‌ను పొందాల్సి ఉంటుంది.

#Eenadu

జంప్‌షేర్‌

ఇందులో సైనప్‌ అయితే 2జీబీ స్టోరేజ్‌ ఉచితంగా వస్తుంది. ఇతరులకు రిఫర్‌ చేస్తూ 18జీబీ వరకు ఉచితంగా పొందొచ్చు. ఇంకా స్టోరేజ్‌ కావాలంటే.. డబ్బులు పెట్టాల్సిందే. 

#Eenadu

ఐస్‌డ్రైవ్‌

దీంట్లో మొదట 10 జీబీ స్టోరేజ్‌ ఉచితంగా లభిస్తుంది. ఆ తర్వాత నెలవారీ, ఏడాదికి, ఏకమొత్తంలో చెల్లించి స్టోరేజ్‌ సేవలు పొందాల్సి ఉంటుంది. 

#Eenadu

ఇవి కాకుండా జియో క్లౌడ్‌, అమెజాన్‌ ఫొటోస్‌, ఇంటర్నెక్స్ట్‌, బెస్ట్‌ఫైల్‌, బ్లోంప్‌, అప్‌లోడ్‌ నవ్‌, లెట్స్‌ అప్‌లోడ్‌ తదితర వెబ్‌సైట్స్‌/యాప్స్‌ కూడా క్లౌడ్‌ స్టోరేజ్‌ సదుపాయాన్ని అందిస్తున్నాయి.

#Eenadu

₹15 వేల్లోపు స్మార్ట్‌ఫోన్లు ఇవే..

వాట్సప్‌, ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఏఐ!

ఫేక్‌ కాల్స్‌కు ‘చక్షు’తో చెక్‌

Eenadu.net Home