దేశవాళీ.. లిస్ట్-ఏ.. టాప్ 10 బ్యాటర్లు!
#Eenadu
1. నారాయణ్ జగదీశన్ (277)
తమిళనాడు జట్టుకు చెందిన జగదీశన్ అరుణాచల్ ప్రదేశ్ జట్టుతో తాజాగా జరిగిన మ్యాచ్‌లో రికార్డు సృష్టించాడు. 141 బంతుల్లో 277 పరుగులు చేసి వ్యక్తిగత అత్యధిక స్కోరు జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు.
Image: Instagram
2. ఎ.డి. బ్రౌన్ (268)
ఇంగ్లాండ్‌లోని సర్రే టీంకు చెందిన ఆటగాడు ఏడీ బ్రౌన్ 2002లో గ్లామోర్గాన్‌తో జరిగిన కౌంటీ క్రికెట్ మ్యాచ్‌లో 160 బంతుల్లో 268 పరుగులు సాధించాడు.
Image: Instagram
3. రోహిత్ శర్మ (264)
శ్రీలంకతో 2014లో జరిగిన అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌లో భారత బ్యాటర్ రోహిత్ శర్మ 173 బంతుల్లో 264 పరుగులు చేశాడు.
Image: RKC
4. జాన్ మాథ్యూ షార్ట్ (257)
ఆస్ట్రేలియా కౌంటీ క్రికెట్‌లో భాగంగా వెస్ట్ ఆస్ట్రేలియా, క్వీన్స్‌లాండ్ మధ్య 2018లో మ్యాచ్ జరిగింది. వెస్ట్ ఆస్ట్రేలియా తరఫున ఆడిన షార్ట్.. 148 బంతుల్లో 257 పరుగులు చేశాడు.
Image: Instagram
5. శిఖర్ ధావన్ (248)
ఇండియా A, దక్షిణాఫ్రికా A జట్ల మధ్య 2013లో జరిగిన మ్యాచ్‌లో ధావన్ 150 బంతుల్లో 248 పరుగులు చేసి ఐదో స్థానంలో ఉన్నాడు.
Image: RKC
6. మార్టిన్ గఫ్తిల్ (237)
న్యూజిలాండ్, వెస్టిండీస్ మధ్య 2015లో జరిగిన అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌లో గఫ్తిల్.. 163 బంతుల్లో 237 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
Image: Instagram
7. ట్రావిస్ మైఖేల్ హెడ్ (230)
ఆస్ట్రేలియా కౌంటీ క్రికెట్ 2021లో ఆసీస్ ఆటగాడు మైఖేల్ హెడ్.. సౌత్ ఆస్ట్రేలియా తరఫున ఆడాడు. క్వీన్స్‌లాండ్‌పై చెలరేగి 127 బంతుల్లో 230 పరుగులు సాధించాడు.
Image: Instagram
8. బెన్ రాబర్ట్ డంక్ (229)
ఈ ఆస్ట్రేలియా ఆటగాడు.. 2014లో కౌంటీ క్రికెట్‌లో క్వీన్స్‌లాండ్‌తో టస్మేనియా తరఫున బరిలోకి దిగాడు. 157 బంతుల్లో 229 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
Image: Instagram
9. పృథ్వీ షా (227)
భారత యువ ఆటగాడు పృథ్వీషా కూడా రికార్డు స్కోరు సాధించాడు. 2021లో దేశవాళీ క్రికెట్‌లో భాగంగా ముంబయి, పుదుచ్చేరి మధ్య మ్యాచ్ జరిగింది. ముంబయి తరఫున ఆడిన పృథ్వీ 152 బంతుల్లో 227 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
Image: Instagram
10. జమీ మైఖేల్ హౌ (222)
న్యూజిలాండ్‌కు చెందిన మైఖేల్ హౌ.. సెంట్రల్ డిస్ట్రిక్ట్స్ తరఫున నార్తర్న్ డిస్ట్రిక్ట్స్‌పై ఆడి.. 138 బంతుల్లో 222 పరుగులు చేశాడు. 1974లో దక్షిణాఫ్రికాకు చెందిన రాబర్ట్ పోలక్ కూడా 222 పరుగులు చేసి పదో స్థానంలో ఉన్నాడు.
Image: RKC