ఈ 10 మలయాళ సినిమాలు చూశారా?
2018
కేరళలో 2018 వరదల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. టొవినో థామస్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం మన దేశం తరఫున ఈ ఏడాది ఆస్కార్ బరిలో నిలిచింది.
OTT - సోనీ లివ్
ది గ్రేట్ ఇండియన్ కిచెన్
సూరజ్, నిమిషా నటించిన ఈ సినిమా ఉత్తమ చిత్రంగా కేరళ రాష్ట్ర పురస్కారాన్ని అందుకుంది. సూరజ్, నిమిషా నటించిన ఈ సినిమకు జెప్ బేబీ దర్శకత్వం వహించారు.
OTT - అమెజాన్ ప్రైమ్
కుంబలంగి నైట్స్
కుంబలంగి ప్రాంతంలో ఓ గంగపుత్రుల కుటుంబం నేపథ్యంలో జరిగే కథ ఇది. ఫహాద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు మద్ సి నారాయణన్ దర్శకుడు.
OTT - అమెజాన్ ప్రైమ్
జల్లికట్టు
కేరళలో ఓ సంప్రదాయ కార్యక్రమం ఆధారంగా తెరకెక్కించిన చిత్రమిది. లిజో జోస్ రూపొందించిన ఈ చిత్రం 2011లో మన దేశం నుంచి ఆస్కార్ బరిలో నిలిచింది.
OTT - అమెజాన్ ప్రైమ్, ఆహా
సూడానీ ఫ్రమ్ నైజీరియా
జకారియా మహమ్మద్ తెరకెక్కించిన ఈ చిత్రం క్రీడా నేపథ్యంలో సాగుతుంది. ఈ చిత్రంలో సౌబిన్ షాహిర్, సామ్యూల్ అబియోలా రాబిన్‌సన్ ముఖ్య పాత్రదారులు.
OTT - నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, ఆహా
మహేశింటే ప్రతీకారం
సత్యదేవ్ ‘ఉమామహేశ్వర ఉగ్రరూపశ్య’ గుర్తుందా? దాని మాతృకే ఈ సినిమా. ఫహాద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో రూపొందిన ఈ చిత్రానికి దిలీష్ పోతన్ దర్శకుడు.
OTT - అమెజాన్ ప్రైమ్
దృశ్యం
‘దృశ్యం’ సిరీస్‌లో తొలి సినిమా ఈ జాబితాలో ఉంది. మోహన్ లాల్, మీనా ప్రధాన పాత్రధారులుగా రూపొందిన ఈ సినిమాకు జీతూ జోసెఫ్ దర్శకుడు.
OTT - హాట్‌స్టార్
మున్నారియిప్పు
మమ్ముట్టి, అపర్ణా గోపీనాథ్ ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ సినిమాకు వేణు దర్శకుడు. జైలు శిక్ష అనుభవిస్తున్న ఓ వ్యక్తి జీవిత చరిత్రను ఓ జర్నలిస్ట్ రాస్తే అనేది సినిమా కథ.
OTT - సన్ నెక్స్ట్
విధేయన్
జాతీయ పురస్కారం అందుకున్న చిత్రమిది. మమ్ముట్టి నటనా వైవిధ్యం ఈ సినిమాలో చూడొచ్చు. ఆడూర్ గోపాలకృష్ణన్ తెరకెక్కించిన ఈ సినిమా కథ ఓ నవల నుంచి తీసుకున్నారు.
OTT - యూట్యూబ్
వైశాలీ
వేదవ్యాసుడి మహాభారతంతోని దేవదాసీ అంశం నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. భరతన్ తెరకెక్కించిన ఈ సినిమాలో సుపర్ణ ఆనంద్, సంజయ్ మిత్ర ప్రధాన పాత్రధారులు.
OTT - అమెజాన్ ప్రైమ్, ఆహా