మెజీషియన్‌ అశ్విన్‌..

టాప్‌ 10 రికార్డ్స్‌

భారత స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. బౌలింగ్‌ ఇంద్రజాలికుడిగా పేరుగాంచిన అశ్విన్‌ టాప్‌ 10 రికార్డులు ఇవీ!

టెస్టుల్లో అత్యధిక ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌లు అశ్విన్‌వే. 106 మ్యాచుల్లో 11 గెలుచుకున్నాడు. 

అనిల్‌ కుంబ్లే (956) తర్వాత భారత్‌ తరఫున అన్ని ఫార్మాట్లలో అత్యధిక వికెట్లు తీసిన ఘనత అశ్విన్‌దే. 765 వికెట్లు పడగొట్టాడు. టెస్టుల్లో అయితే 537. 

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌ షిప్‌లో వేగంగా వంద వికెట్లు తీసిన బౌలర్‌. మొత్తంగా WTCలో 195 వికెట్లు తీశాడు. 

టెస్టుల్లో అత్యధిక 5 వికెట్ల ఫీట్‌ సాధించిన రెండో బౌలర్‌. 37 సార్లు ఆ ఘనత సాధించాడు. తొలి స్థానం మురళీధరన్‌ (67)ది. 

టెస్టుల్లో అత్యధిక బౌల్డ్‌లు, ఎల్‌బీడబ్ల్యూలు చేసిన బౌలర్‌. 226 మంది బ్యాటర్లను ఇలా ఔట్‌ చేశాడు. 

టెస్టుల్లో ఎక్కువసార్లు 5 వికెట్లు.. 100+ పరుగులు చేసిన క్రికెటర్‌. అశ్విన్‌ ఇలా నాలుగుసార్లు చేయగా.. మొదటి స్థానం ఇయాన్‌ బోథమ్‌ (5)ది.

సొంత గడ్డ మీద టెస్టుల్లో అత్యధిక వికెట్లు (383) తీసిన బౌలర్‌. 65 మ్యాచుల్లో ఈ ఘనత సాధించాడు. 

భారత్‌లో ఒక ఇన్నింగ్స్‌లో 5+ వికెట్లు తీసిన పెద్ద వయస్కుడు. ఈ ఏడాది సెప్టెంబరులో బంగ్లాదేశ్‌పై ఈ ఫీట్‌ (6/88) చేశాడు. 

టెస్టుల్లో ఒక బ్యాటర్‌ను అత్యధికసార్లు ఔట్‌ చేసిన మొదటి ఇండియన్‌ బౌలర్‌. బెన్‌ స్టోక్స్‌ను 13సార్లు పెవిలియన్‌కు పంపాడు. 

టెస్టుల్లో అత్యధికంగా 350 వికెట్లు పడగొట్టిన బౌలర్‌. 66 మ్యాచుల్లోనే ఈ ఘనత సాధించాడు. 

WPL వేలం.. అత్యధిక ధర పలికింది వీరే

భారత్‌లో టాప్‌-10 గూగుల్డ్‌ స్పోర్ట్స్‌ ఈవెంట్స్‌!

గబ్బాలో గతసారి పంత్‌ గర్జన.. ఈ సారి ఎవరు?

Eenadu.net Home